బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ కూతురు, అర్జున్ కపూర్ సోదరి అన్షులా కపూర్ పెళ్లి పీటలెక్కబోతోంది. గతేడాది ( జూలై 2025లో) తన లాంగ్‌టైమ్ బాయ్‌ఫ్రెండ్ రోహన్ థక్కర్‌తో గ్రాండ్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అన్షులా.. ఈ ఏడాది గ్రాండ్ వెడ్డింగ్‌కు సిద్ధమైంది. ప్రస్తుతం ముంబైలో వీరి ప్రీ-వెడ్డింగ్ వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అర్జున్ ఎమోషనల్ ..
అయితే, ఈ పెళ్లి వేడుకల్లో ఒక క్రేజీ అండ్ ఎమోషనల్ సీన్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఈ వేడుకలో తన సిస్టర్ అన్షులా ను హత్తుకుని అర్జున్ కపూర్ ఎమోషనల్ అయ్యారు. పంజాబీ సంప్రదాయం ప్రకారం జరిగిన 'చుడా' వేడుకలో అన్షులా తన చేతులకు ఉన్న ‘కలీరా’లను అక్కడ కూర్చున్న పెళ్లికాని వారిపై విదిల్చింది. ఈ సాంప్రదాయం ప్రకారం ఆ కలీరా ఎవరిపై పడితే.. నెక్స్ట్ పెళ్లి వారికే అవుతుందని నమ్ముతారు. అక్కడ ఖుషీ కపూర్, ఓరీ వంటి ఎంతోమంది ఉన్నప్పటికీ.. ఊహించని విధంగా ఆ కలీరా నేరుగా వచ్చి అన్న అర్జున్ కపూర్ మీద పడింది!
నెక్స్ట్ పెళ్లి అర్జున్ కపూర్‌దేనా?
కలీరా తనపై పడటమే ఆలస్యం, అర్జున్ కపూర్ ఆనందానికి అవధుల్లేవు. రూమ్‌లోనే అందరికంటే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతూ.. గాల్లోకి ఎగురుతూ ఆ కలీరాను అందరికీ చూపిస్తూ తెగ మురిసిపోయాడు. దీనికి సంబంధించిన వీడియోను అన్షులా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. కలీరా తనపై పడాలని ఇంత కమిట్‌మెంట్‌తో ఉన్న వ్యక్తిని నేనెక్కడా చూడలేదు. ఆ కలీరాపై స్మైల్ అని రాసి ఉంది అంటూ సరదాగా రాసుకొచ్చింది.
ఒకే కుటుంబంగా..
బోనీ కపూర్ మొదటి భార్య మోనా శౌరీ సంతానమే అర్జున్, అన్షులా. ఆ తర్వాత బోనీ కపూర్ శ్రీదేవిని వివాహం చేసుకోగా.. వారికి జాన్వీ, ఖుషీ కపూర్ జన్మించారు. మోనా (2012), శ్రీదేవి (2018) ఇద్దరూ మరణించినప్పటికీ.. ఈ నలుగురు తోబుట్టువులు మాత్రం ఎంతో అన్యోన్యంగా ఉంటారు. అన్షులా మెహందీ వేడుకల్లో వరుణ్ ధావన్, కరిష్మా కపూర్, నీతూ కపూర్ వంటి స్టార్స్ సందడి చేయగా.. జాన్వీ, ఖుషీలు దగ్గరుండి అన్ని పనులు చూసుకోవడం అందరినీ ఆకట్టుకుంది. మొత్తానికి ఈ 'కలీరా' ట్విస్ట్‌తో త్వరలోనే అర్జున్ కపూర్ కూడా పెళ్లి వార్త చెప్తారేమోనని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది..
