‘క్రేజీ కళ్యాణం’లో అనుపమ ఫస్ట్ లుక్ పోస్టర్ అదుర్స్

‘క్రేజీ కళ్యాణం’లో అనుపమ ఫస్ట్ లుక్ పోస్టర్ అదుర్స్

అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, నరేష్ వీకే,అఖిల్ ఉడ్డెమారి లీడ్ రోల్స్‌‌లో బద్రప్ప గాజుల తెరకెక్కిస్తున్న చిత్రం ‘క్రేజీ కళ్యాణం’. యారో సినిమాస్ బ్యానర్ పై బూసమ్ జగన్ మోహన్ రెడ్డి నిర్మిస్తున్నారు. బుధవారం హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ పుట్టినరోజు సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు.ఇందులో పెళ్లి కూతురు గెటప్ లో  డాన్స్ చేస్తున్న ఆమె స్టిల్ ఆకట్టుకుంటుంది. 

ఈ చిత్రంలో కీర్తి అనే పాత్రలో  అనుపమ అలరించనుందని రివీల్ చేశారు.  పెళ్లి చుట్టూ సాగే ఆసక్తికరమైన కథతో పూర్తిస్థాయి ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌గా తెరకెక్కిస్తున్నామని, తెలంగాణలోని పలు గ్రామీణ ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపామని ఈ సందర్భంగా మేకర్స్‌‌ తెలియజేశారు. సురేష్ బొబ్బిలి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.