అన్నయ్య అంటూ హగ్ ఇచ్చి రాఖీ కట్టేసింది.. అనుపమ వీడియో వైరల్

అన్నయ్య అంటూ హగ్ ఇచ్చి రాఖీ కట్టేసింది.. అనుపమ వీడియో వైరల్

మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ఈగల్(Egale). పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. అనుపమ(Anupama), కావ్య థాపర్(Kavya Thapar), నవదీప్(Navadeep), అవసరాల శ్రీనివాస్(Avasarala Srinivas), మధుబాల(Madhubala)కీ రోల్స్ చేస్తున్న ఈ సినిమా.. ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్ పనుల్లో వేగం పెంచారు మేకర్స్. ఇందులో భాగంగానే ఆదివారం(ఫిబ్రవరి 4) ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. 

ఈ ఈవెంట్ లో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. అదేంటంటే.. కొన్ని రోజుల ముందు ఈగల్ టీమ్ రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూ జరిగింది. ఆ ఇంటర్వ్యూలో అనుపమ మాట్లాడుతూ.. దర్శకుడు కార్తీక్ ను అన్నయ్య అని పిలిచింది. దానికి హీరో రవితేజ స్పందిస్తూ.. నువ్వు కార్తీక్ ని అన్నయ్య అని పిలుస్తావా.. అందమైన అమ్మాయిలూ అన్నయ్య అనే పదం వాడకూడదు. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేస్కో అన్నాడు.. ఆ వీడియో సోషల్ మీడియా తెగ వైరల్ అయ్యింది. 

ఆ వీడియోనే ఈగల్ ఈవెంట్ లో అనుపమ మాట్లాడటానికి స్టేజిపైకి వచ్చినప్పుడు ప్లే చేశారు. ఆ వీడియో చూసిన అనుపమ నవ్వుతూ.. సారీ రవితేజగారు. కార్తీక్ తో నేను నాలుగు సినిమాలు చేశాను. ఆయనతో ఉన్న బాండింగ్ అలాంటిది. అలాగే అలవాటు అయిపోయింది కూడా. మార్చుకోలేను.. అంటూ చెప్పుకొచ్చింది. అదే సమయంలో యాంకర్ సుమ రాఖీ తీసుకొచ్చి అనుపమకి ఇవ్వగా.. అదే స్టేజిపై కార్తీక్ కి రాఖీ కట్టి హగ్ ఇచ్చింది అనుపమ. ప్రస్తుతం ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.