రెమోలా లవ్ చేసేవాడు.. మరుసటి రోజే అపరిచితుడిలా కొట్టేవాడు.. అనుపమ Ex లవర్ ఇలాంటోడా !

రెమోలా లవ్ చేసేవాడు.. మరుసటి రోజే అపరిచితుడిలా కొట్టేవాడు.. అనుపమ Ex లవర్ ఇలాంటోడా !

సినీ నటి అనుపమ పరమేశ్వరన్ తన లవ్, బ్రేకప్ గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. ఆమె తన మాజీ ప్రియుడి ప్రవర్తన, స్వభావంపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అతని మనస్తత్వం తనను విస్మయానికి గురిచేసిందని.. ఒక రోజు రెమోలా ప్రేమించేవాడని చెప్పింది. అతని ప్రేమ ఎంత బాగుండేదంటే.. ఇలాంటి వ్యక్తి జీవితంలో దొరకడం ఎంత అదృష్టమో అనేంతలా మైమరచిపోయేలా ఉండేదని తెలిపింది.

అసలు ఇది.. కలా..? నిజమా..? అనేంత గొప్పగా అతని ప్రేమ ఉండేదని చెప్పింది. మరుసటి రోజు అపరిచితుడిలా కొట్టేవాడని.. మళ్లీ ఆ తర్వాత ఇంకెప్పుడూ ఇలా చేయనని చిన్న పిల్లాడిలా బతిమాలుతూ ఏడ్చేవాడని ఆమె చెప్పింది. కానీ.. తన బుద్ధి మారేది కాదని.. మళ్లీ అదే విధంగా తనతో ప్రవర్తించేవాడని.. ఇలానే తన లవ్ సైకిల్ సాగిందని ఆమె తన బ్రేకప్ గురించి బయటపడింది.

అనుపమ పరమేశ్వరన్, ధృవ్ విక్రమ్ మధ్య ప్రేమాయణం నడిచిందని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'బైసన్ కాలమాదన్' సినిమాలో అనుపమ, ధృవ్ కలిసి నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఈ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అవార్డు ఫంక్షన్స్లో స్టేజ్ మీదే ఒకరిని చూసి ఒకరు సిగ్గుపడటం, మురిసిపోవడంతో ఈ రూమర్లకు బలం చేకూరింది. ముంబైలో జరిగిన ఒక ఈవెంట్లో ఇద్దరూ సన్నిహితంగా సెల్ఫీలు దిగి హార్ట్ ఎమోజీలు పెట్టుకోవడంతో.. ఈ ఇద్దరి మధ్య ప్రేమ పుకార్లు కాదని.. నిజమేనని అందరూ బలంగా నమ్మారు.

ఇద్దరి మధ్య ప్రేమ పతాక స్థాయికి చేరి కలహాలకు కేరాఫ్గా మారడంతో ఇద్దరూ విడిపోయారని ప్రచారం జరిగింది. అనుపమ తన ఇన్స్టాగ్రాంలో పోస్ట్ చేసిన ఫొటోలు, క్యాప్షన్స్ చూసిన నెటిజన్లకు ఆమె తన ప్రియుడితో విడిపోయిందని క్లారిటీ వచ్చేసింది. అయితే.. ఈ ఇంటర్వ్యూల్లో ఆమె తన మాజీ ప్రియుడి పేరు ప్రస్తావించకుండా.. ఇద్దరి మధ్య జరిగిన గొడవలు, అతని ప్రవర్తన గురించి మాత్రమే చెప్పడంతో ఆమె చెప్పినవన్నీ ధృవ్ విక్రమ్ గురించేననే ప్రచారం జరుగుతోంది.