Anushka Shetty : రీసెంట్గా ప్రభాస్తో పెళ్లి..ఇప్పుడేమో అతనితోనా..?

Anushka Shetty : రీసెంట్గా ప్రభాస్తో పెళ్లి..ఇప్పుడేమో అతనితోనా..?

ఇండియాస్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ప్రభాస్(Prabhas) కు పెళ్లయిపోయింది. అమ్మాయి ఎవరు అనుకుంటున్నారా? ఇంకెవరు మన అనుష్క(Anushka)నే. ఈ జంటకు ఒక పాప కూడా. ఏంటి.. ఆశ్చర్యపోతున్నారా? అవును నేను చెప్పింది నిజమే.

ప్రభాస్, అనుష్కకు పెళ్లయింది. అయితే ఈ పెళ్లి చేసింది వాళ్ళ పెద్దలు కాదు..ఏఐ. అవును..ఏఐ టెక్నాలజితో ప్రభాస్, అనుష్కకు పెళ్ళైతే ఎలా ఉంటుంది? వారికి పాప పుడితే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది నెటిజన్స్ కు. ఆలోచన రావడమే ఆలస్యం ఏఐ ద్వారా ఈ ఇద్దరికీ పెళ్లి చేసి, ఒక బుజ్జి పాపను కూడా పుట్టించేశారు. 

రీసెంట్గా ఈ జంటకి పెళ్లయిపోయిందని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ ఆయిపోయాయి. అవి చూసిన నెటిజన్స్..అబ్బా..ప్రభాస్, అనుష్క జంట ఎంత బాగుందో..నిజంగా పెళ్లి చేసుకుంటే బాగుండు అంటూ కామెంట్స్ కూడా చేసారు.

ఇప్పడు మరోసారి అనుష్క పెళ్లి న్యూస్ బయటికి వచ్చింది. తాజాగా స్వీటీ పెళ్లి విషయమై సోషల్ మీడియాలో చర్చ షురూ అయింది. ఒక స్టార్ క్రికెటర్తో అనుష్కపెళ్లికి సిద్ధమైనట్లు..వీరు ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియాలోగాసిప్స్ మొదలయ్యాయి. అయితే ఆ స్టార్ క్రికెటర్ ఎవరు అనే విషయాన్ని మాత్రం ఎవరు ఎక్కడ బయటపెట్టలేదు.

అంతేకాదు వీరి పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు కూడా ఓకే చెప్పారని, త్వరలోనే వీరి మ్యారేజ్ కూడా జరగనుందని..ఇదే విషయాన్నిఅనుష్క మరికొన్నిరోజుల్లో తన ఫ్యాన్స్ కు  అధికారికంగా చెప్పనుందని సోషల్ మీడియాలో చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవుతున్నప్పటికీ..ఇవన్నీ ఒట్టి రూమర్స్ అని ఫ్యాన్స్ అనుష్క ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

ఏదేమైనప్పటికీ..నిజానికి చాలా కాలంగా ప్రభాస్, అనుష్కల పెళ్లిపై ఫ్యాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు.వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుండు అని ఆలోచిస్తున్నారు.ఇక వీరి పెళ్లి మ్యాటర్ బాహుబలి సమయంలో అయితే.. సినిమా పూర్తయిన వెంటనే ఈ ఇద్దరు పెళ్లిచేసుకోబోతున్నారు అనే వార్తలు బలంగా వినిపించాయి. మరి ఏమవుతువుందో చూడాలి.