Anushka Shetty: 9వ శతాబ్దపు మాంత్రికుడి స్టోరీలో అనుష్క.. హాలీవుడ్ రేంజ్‌లో 'కథనార్' ట్రైలర్!

Anushka Shetty: 9వ శతాబ్దపు మాంత్రికుడి స్టోరీలో అనుష్క.. హాలీవుడ్ రేంజ్‌లో 'కథనార్' ట్రైలర్!

వెండితెరపై'అరుంధతి', 'భాగమతి', 'బాహుబలి' వంటి చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్న నటి అనుష్క శెట్టి.  ఇప్పుడు ఈ స్వీటీ మరో భారీ విజువల్ వండర్‌తో  అభిమానుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది.  ‘కథనార్ – ది వైల్డ్ సోర్సెరర్’ (Kathanar – The Wild Sorcerer) చిత్రంతో ఆమె మలయాళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. లేటెస్ట్ గా మూవీ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

పాన్ ఇండియా లక్ష్యంగా!

చాలా కాలం తర్వాత అనుష్క ఒక పీరియాడిక్ ఫాంటసీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. జయసూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ ‘కథనార్ – ది వైల్డ్ సోర్సెరర్’ చిత్రాన్ని దర్శకుడు రోజిన్ థామస్ అద్భుతమైన విజువల్స్‌తో తెరకెక్కిస్తున్నారు. శ్రీ గోకులం మూవీస్ బ్యానర్‌పై గోకులం గోపాలన్ అత్యంత భారీ బడ్జెట్‌తో, హాలీవుడ్ ప్రమాణాలకు తగ్గట్టుగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. 

కథా నేపథ్యం

ఈ మూవీ 9వ శతాబ్దానికి చెందిన 'కడమత్త్తు కథనార్' అనే క్రైస్తవ మతాచార్యుడు, మాంత్రికుడి చుట్టూ తిరుగుతుంది. కేరళ జానపద కథల్లో ఈ పాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అతీంద్రియ శక్తులు, గాలి ప్రాణులు, క్షుద్ర పూజల నేపథ్యంలో సాగే ఈ కథలో అనుష్క పాత్ర అత్యంత కీలకమని తెలుస్తోంది. ఈ సినిమా టీజర్ చూస్తుంటే, ఇందులో ఆమె లుక్ , నటన ఎంతో గంభీరంగా, నిగూఢంగా ఉన్నట్లు తెలుస్తుంది.

 కొత్త లోకంలోకి తీసుకెళ్లేలా..

ట్రైలర్ చూస్తుంటే మనల్ని ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్లేలా ఉంది. ముఖ్యంగా ఇందులో వాడిన విజువల్ ఎఫెక్ట్స్ (VFX),సెట్టింగ్స్ మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. కేవలం కేరళ సంస్కృతి మాత్రమే కాకుండా, ఒక ఇంటర్నేషనల్ ఫాంటసీ మూవీ చూస్తున్న అనుభూతిని కలిగిస్తోంది. 'ఘాటీ' వంటి సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా, 'కథనార్'తో అనుష్క మళ్లీ తన పూర్వ వైభవాన్ని చాటుకుంటుందని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు.

ALSO READ : నాగార్జున వందో చిత్రంలో డబుల్ రోల్?

భారీ తారాగణం.

ఈ చిత్రంలో అనుష్క, జయసూర్యలతో పాటు ప్రభుదేవ, వినీత్, శాండీ మాస్టర్, హరీష్ ఉత్తమన్, శ్రీకాంత్ మురళి వంటి ప్రముఖ నటులు నటిస్తున్నారు. రాహుల్ సుబ్రమణియన్ అందించిన సంగీతం సినిమాలోని మిస్టరీ ఎలిమెంట్స్‌ను మరింత ఎలివేట్ చేస్తోంది. ఈ ‘కథనార్’ చిత్రం కేవలం మలయాళంకే పరిమితం కాకుండా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అనుష్క శెట్టిలోని నటిని మరోసారి విశ్వరూపంలో చూసేందుకు సినీ ప్రియులు వేచి చూస్తున్నారు. మరి ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.