AP Election 2026: జగన్ కు బిగ్ రిలీఫ్..  వైసీపీ అభ్యర్థులకు భద్రత కల్పించాలన్న హైకోర్టు.. 

AP Election 2026: జగన్ కు బిగ్ రిలీఫ్..  వైసీపీ అభ్యర్థులకు భద్రత కల్పించాలన్న హైకోర్టు.. 

ఏపీలో స్థానిక ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. ప్రధాన పార్టీలన్నీ దాదాపు అన్ని స్థానాలకు అభ్యర్థులను కూడా ఖరారు చేయడం.. ఎన్నికలకు గట్టిగా 12 రోజుల సమయం మాత్రమే ఉండటంతో ఊపందుకున్న ప్రచారం, నామినేషన్ల ర్యాలీతో పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరింది. పుంగనూరు, రాయచోటి లాంటి చోట్ల వైసీపీ అభ్యర్థులపై టీడీపీ కార్యకర్తలు దాడికి దిగటంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో తమ అభ్యర్థులకు భద్రత కల్పించాలని ఏపీ హైకోర్టును ఆశ్రయించిన వైసీపీకి బిగ్ రిలీఫ్ దక్కింది. ఎన్నికల్లో పోటీ చేసే వైసీపీ అభ్యర్థులకు భద్రత కల్పించాలని ఆదేశాలిచ్చింది హైకోర్టు.

పుంగనూరు, రాయచోటిలో తమ అభ్యర్థులపై, పార్టీ ఆఫీసులపై టీడీపీ శ్రేణులు దాడి చేసిన క్రమంలో తమ అభ్యర్థులకు భద్రత కల్పించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది వైసీపీ. వైసీపీ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు ఎన్నికల్లో పోటీ చేసే వైసీపీ అభ్యర్థులకు భద్రత కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది.

నామినేషన్ల ప్రక్రియ మొదలైన రోజే పుంగనూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నామినేషన్ వేయడానికి వెళ్తున్న వైసీపీ అభ్యర్థికి మద్దతుగా వెళ్తున్న ఎంపీ మిథున్ రెడ్డి కాన్వాయ్ పై రాళ్ళ దాడికి దిగారు టీడీపీ శ్రేణులు. ఈ దాడిలో మిథున్ రెడ్డి వాహనం ధ్వంసమైంది. 

ALSO READ : రూ.20 వేల అప్పు వివాదం..

ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. మిథున్ రెడ్డి సహా వైసీపీ నేతల కార్లు ధ్వంసమయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గాల్లో కాల్పులు జరిపి, ఇరు వర్గాలను చెదరగొట్టి  పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.