వంగవీటి రాధా బాటలో జనసేనలోకి టీడీపీ నేత ప్రణీత్ పెనుమాదు.. తిరుపతి మేయర్ రేసులో..!

వంగవీటి రాధా బాటలో జనసేనలోకి టీడీపీ నేత ప్రణీత్ పెనుమాదు.. తిరుపతి మేయర్ రేసులో..!

విజయవాడ: స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో ఆంధ్రాలో రాజకీయాలు మరోసారి ఘాటెక్కాయి. మేయర్ రేసులో నిలిచేందుకు ఇద్దరు నేతలు టీడీపీ నుంచి జనసేనలో చేరిపోయారు. ఒకరు విజయవాడ మేయర్ రేసులో నిలిచేందుకు జనసేనలో చేరగా, మరొకరు తిరుపతి మేయర్ రేసులో నిలిచేందుకు జనసేనలో చేరడం గమనార్హం. విజయవాడకు చెందిన వంగవీటి రాధా, తిరుపతికి చెందిన ప్రణీత్ పెనుమాదు జనసేనలో చేరిపోయారు.

విజయవాడ, తిరుపతి రెండూ అన్ రిజర్వ్డు కార్పొరేషన్లే. ఈ రెండు కార్పొరేషన్లలో జనసేన సత్తా చాటాలని భావిస్తోంది. టీడీపీ పొత్తు ధర్మంలో భాగంగా ఈ రెండు కార్పొరేషన్లను అనధికారికంగా జనసేనకు వదిలేసినట్టేనని ఈ తాజా పరిణామాలతో స్పష్టమైంది.

జనసేన, టీడీపీ మధ్య పురపాలక, నగర పాలక సీట్ల పంపకాల విషయంలో చర్చలు కొనసాగుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో 40 శాతం సీట్లకు జనసేన పట్టుబడుతుండటంతో చర్చలు ఓ కొలిక్కి రావడం లేదు. చంద్రబాబుతో ఇప్పటికే పవన్ కల్యాణ్ ఈ విషయమై సమావేశం అయ్యారు. జనసేన కీలక నేతలు కూడా చంద్రబాబుతో చర్చించారు.

ఏపీలో 6 కార్పొరేషన్లు, 40 మున్సిపాలిటీలను కూటమి పొత్తు ధర్మంలో భాగంగా తమకు కేటాయించాలని జనసేన డిమాండ్ చేస్తుండటం గమనార్హం. రెండు రోజుల్లో మొత్తం లిస్ట్.. ఏ పార్టీకి ఆ పార్టీ కాకుండా.. కూటమే విడుదల చేస్తుందని స్థానిక ఎన్నికల అభ్యర్థులపై జనసేన నేత, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చెప్పుకొచ్చారు.