AP News : అల్లూరి జిల్లాలో భారీ పేలుడు : ఐదుగురు వ్యక్తులు స్పాట్ డెడ్

AP News : అల్లూరి జిల్లాలో భారీ పేలుడు : ఐదుగురు వ్యక్తులు స్పాట్ డెడ్

అనంతగిరి: అల్లూరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అనంతగిరి మండలం పినకోట వద్ద రోడ్డు పనుల కోసం బ్లాస్టింగ్ పనులు చేపట్టారు. ఇందు కోసం జిలెటిన్ స్టిక్స్లు అమర్చిన ప్రత్యేక పరికరాన్ని వినియోగించారు.

 అయితే.. పేలుడు సమయంలో అది మిస్ఫైర్ కావడంతో అక్కడున్న ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పేలుడు ధాటికి రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్, ముగ్గురు కార్మికులు మృతి చెందగా.. అటు వైపుగా వెళ్తున్న ఓ టీచర్ కూడా ప్రాణాలు కోల్పోయారు.

 అధికారులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతులను టీచర్ సునీత(విశాఖ), మణి (దేవరాపల్లి), నారాయణ రావు(చీడకాడ), పవన్ కుమార్(కడప)గా గుర్తించారు. మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ ఘటనపై హోంమంత్రి అనిత స్పందించారు. అల్లూరి జిల్లా కలెక్టర్, ఎస్పీతో ఫోన్లో మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.