HDFC offers: యాపిల్ ప్రొడక్ట్స్పై భారీ డిస్కౌంట్ 

HDFC offers: యాపిల్ ప్రొడక్ట్స్పై భారీ డిస్కౌంట్ 

ఐ ఫోన్లు కొనాలనుకునేవారికి యాపిల్ గుడ్ న్యూస్ చెప్పింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌తో కలిసి ఆఫర్లు ప్రకటించింది. ఐఫోన్ 14 సిరీస్‌తో పాటు మాక్‌ బుక్స్‌, ఐపాడ్‌, ఎయిర్ పాడ్స్‌కు ఈ ఆఫర్లు వర్తించనున్నాయి. అయితే యాపిల్‌ వెబ్‌సైట్ లేదా యాపిల్ ఫిజికల్‌ స్టోర్‌‌ నుంచి హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్‌ తో ప్రొడక్ట్స్‌ కొన్నవాళ్లకే ఈ అవకాశం కల్పించారు. 

ఆఫర్ లో భాగంగా ఐఫోన్ 14 సిరీస్‌పై (ఐఫోన్‌ 14, 14ప్లస్, 14ప్రో, 14 ప్రో మ్యాక్స్) రూ.7 వేల భారీ డిస్కౌంట్ లభిస్తుంది. ఐపాడ్ 10వ జనరేషన్‌పై రూ. రూ.3,000, ఐపాడ్ ఎయిర్‌‌పై రూ. 4000, ఐపాడ్ ప్రో (12.9 ఇంచ్ డిస్‌ప్లే)పై రూ.5.000 డిస్కౌంట్ లభిస్తుంది. ఇవే కాకుండా మాక్‌ బుక్‌ ఎయిర్ ఎం2 చిప్, మాక్‌ బుక్ ప్రో 13 ఇంచ్ డిస్‌ప్లేపై  రూ.10,000, యాపిల్ వాచ్ ఆల్ట్రాపై రూ.5000, యాపిల్ వాచ్ సిరీస్ 8పై రూ. 4000, ఎయిర్ పాడ్ ప్రో సెకండ్ జనరేషన్‌పై రూ.2000 డిస్కౌంట్ ప్రకటించారు. ఈ ఆఫర్లు రిపబ్లిక్ డే వరకు అందుబాటులో ఉండనున్నాయి.