బేగంపేట పాస్ పోర్ట్ ఆఫీస్ వద్ద దరఖాస్తుదారుల ఇబ్బందులు

బేగంపేట పాస్ పోర్ట్ ఆఫీస్ వద్ద దరఖాస్తుదారుల ఇబ్బందులు

హైదరాబాద్: సర్వర్ మొరాయించడంతో బేగంపేట పాస్ పోర్ట్ కార్యాలయం వద్ద  దరఖాస్తుదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాంకేతికలోపం తలెత్తడంతో పాస్ పోర్ట్ కార్యాలయం వద్ద దరఖాస్తు దారులు బారులు తీరారు. ఉదయం నుంచి సర్వర్లు  పనిచేయకపోవడంతో వారంతా పాస్ పోర్ట్ కార్యాలయం ఎదుట గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. దీంతో పాస్ పోర్టు కార్యాలయ సిబ్బందిపై దరఖాస్తుదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే కార్యాలయ సిబ్బంది వారికి సర్ది చెప్పారు. దేశవ్యాప్తంగా పాస్ పోర్ట్ కార్యాలయాల్లో సర్వర్లు డౌన్ కావడంతో పాస్ పోర్ట్ల జారీ విషయంలో ఇబ్బందులు తలెత్తినట్లు వారికి వివరించారు.

ఈరోజు జారీ చేయవలసిన పాస్ పోర్ట్ లను తిరిగి సెలవు ఉన్న రోజునే ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తామని అధికారులు చెప్పారు. కాగా... పాస్ పోర్టు కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నామని, నిత్యం ఇలా ఏదో ఓ కారణంతో పాస్ పోర్టును పొందలేకపోతున్నామని కొంతమంది దరఖాస్తులు చెబుతుండగా... ఇంకోసారైనా ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా చూడాలని మరికొంతమంది దరఖాస్తుదారులు సూచించారు.