ఐటీబీపీలో కానిస్టేబుల్ ఉద్యోగాలు

ఐటీబీపీలో కానిస్టేబుల్ ఉద్యోగాలు

ఇండో- టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ) స్పోర్ట్స్ కోటా- కింద 248 కానిస్టేబుల్ (జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్యూటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ రిలీజ్​ చేసింది. అర్హులైన అభ్యర్థులు నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 28లోగా ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దరఖాస్తు చేసుకోవాలి.

క్రీడాంశాలు: బాక్సింగ్, ఫుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాల్, జిమ్నాస్టిక్, హాకీ, అథ్లెటిక్స్, ఆక్వాటిక్స్, ఈక్వెస్ట్రియన్, స్పోర్ట్స్ షూటింగ్, వెయిట్ లిఫ్టింగ్, ఉషు, కబడ్డీ, రెజ్లింగ్, ఆర్చరీ, కయాకింగ్, కానోయింగ్, రోయింగ్.
అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత క్రీడాంశంలో ప్రతిభావంతులై ఉండాలి. వయసు 21 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. నెలకు రూ.21,700 నుంచి -రూ.69,100 జీతం చెల్లిస్తారు.
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు నవంబర్ 28 లోపు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు www.itbpolice.nic.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.