మీ పిల్లలు నలుగురిలో కలవట్లేదా ? కొత్తవాళ్లంటే భయమా? పేరెంట్స్ ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి !

మీ పిల్లలు నలుగురిలో కలవట్లేదా ? కొత్తవాళ్లంటే  భయమా?  పేరెంట్స్ ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి !

కొందరు పిల్లలకి ఇంట్లో ఓ పట్టాన కాలు ఆగదు. ఎప్పుడూ ఆటలంటూ గ్రౌండ్స్ లోనే గంటలు గంటలు గడుపుతుంటారు. ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతారు కూడా. కానీ, మరికొందరు పిల్లలు మాత్రం నలుగురిలో కలవడానికి అసలు ఇష్టపడరు. కొత్తవాళ్లతో మాట్లాడాలంటేనే భయపడుతుంటారు. బంధువులు,స్నేహితుల ఇళ్లకి వెళ్లడానికి కూడా పెద్దగా ఆసక్తి చూపించరు. మరి ఇలాంటి పిల్లల్ని మార్చాలంటే  ఎలా ..

*పిల్లలు నలుగురిలో కలవడానికి ఇబ్బంది పడుతుంటే.. తరచూ వాళ్లని ఫ్రెండ్స్, బంధువుల ఇళ్లకి తీసుకెళ్తుండాలి. స్నేహితులతో కలిసి ఎక్కువసేపు ఆడుకునేలా చూడాలి. అప్పుడుప్పుడు పిల్లల ఫ్రెండ్స్ ని ఇంటికి పిలిచి లంచ్, డిన్నర్ లాంటివి ఆర్గనైజ్ చేస్తుండాలి. వీటివల్ల పిల్లలు సోషల్ కల్చర్ కి అలవాటవుతారు.

*పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నా.. వాళ్లకు ఇష్టం లేకపోతే వెంటనే వచ్చేయొచ్చని చెప్పాలి. ఇలా చేయడం వల్ల కొత్త ప్రదేశాలకు, తెలియని మనుషుల మధ్యకు వెళ్లడానికి వాళ్లు ఇబ్బందిగా ఫీల్ అవ్వరు.

*చాలామంది పేరెంట్స్ ఇతర పిల్లలతో పోలుస్తూ 'నువ్వు కూడా అలా ఉండు" అని చెప్తుంటారు. కానీ, అలా ఇతరులతో పోల్చడం వల్ల పిల్లల మనసు నొచ్చుకుంటుంది. అందుకే అలాంటి పొరపాట్లకి దూరంగా ఉండాలి.

*ప్రేమగా వాళ్లలో మార్పు తెచ్చే ప్రయత్నం చేయాలి. ఫ్యామిలీ ఫంక్షన్స్ లో ఫన్నీ గేమ్స్ లాంటివి పెట్టి అందులో పిల్లల్ని భాగం చేయాలి.

*స్కూల్ తర్వాత వీలైనంత ఎక్కువసేపు ఫ్రెండ్స్ తో  ఆడుకోనివ్వాలి. పిల్లల ప్రవర్తన లో ఏ మాత్రం మార్పు కనిపించినా వెంటనే మెచ్చుకోవాలి. దానివల్ల వాళ్లలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.