స్మార్ట్ ఫోన్, ల్యాప్‌టాప్ ఓవర్ హీట్ అవుతున్నాయా ? జాగ్రత్త.. లైట్ తీసుకుంటే బాంబులా పేలిపోతుంది..

స్మార్ట్ ఫోన్, ల్యాప్‌టాప్ ఓవర్ హీట్ అవుతున్నాయా ? జాగ్రత్త.. లైట్ తీసుకుంటే బాంబులా పేలిపోతుంది..

ఛార్జింగ్ పెట్టిన మొబైల్ పేలిపోయిందనో, ల్యాప్‌టాప్ కాలిపోయిందనో అప్పుడప్పుడు వార్తల్లో చూస్తూనే ఉంటాం.... సాధారణంగా వాటి బ్యాటరీలు ఫెయిల్ అవ్వడం వల్ల ఇలా జరుగుతుంది. రీఛార్జబుల్ బ్యాటరీలను లిథియం అయాన్ బ్యాటరీ టెక్నాలజీతో తయారు చేస్తారు. అవి ఎక్కువ వేడెక్కినప్పుడు అప్పుడప్పుడు ఇలా జరుగుతుంది. కానీ పేలిపోకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.....

*మొబైల్ ఫోన్స్, ల్యాప్ టాప్ అనే కాదు బ్లూటూత్ స్పీకర్, స్మార్ట్ వాచ్, వైర్ లెస్ ఇయర్ ఫోన్స్ వల్ల కూడా ఈ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అందుకే వాటిని జాగ్రత్తగా కాపాడాలి.

*మొబైల్ ఫోన్, ల్యాప్ టాప్ ఎక్కువ వేడి కాకుండా చూసుకోవాలి. అవి వాడుతున్నప్పుడు వాటిలో బ్యాటరీ పర్సంటేజ్ 20 శాతానికి తగ్గ కుండా చూసుకోవాలి. తక్కువ ఛార్జింగ్ ఉన్నప్పుడు ఫోన్ వాడితే బ్యాటరీ తొందరగా వేడెక్కుతుంది.

*గాడ్జెట్స్ వాడుతుంటే వేడెక్కుతాయి. వేడిగా ఉన్నప్పుడు వాటిని ఛార్జ్ చేయొద్దు. అలా చేస్తే బ్యాటరీలో కెమికల్ రియాక్షన్ జరిగి పేలిపోతుంది. వంటగదిలో గ్యాస్ స్టవ్ దగ్గర ఛార్జింగ్ పెట్టకపోవడమే మంచిది.

*బ్యాటరీలు దాదాపు 45 సెల్సియస్ వేడిని తట్టుకుంటాయి. అందుకని బయట ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు వాటిని వాడకపోవడమే మంచిది. ఎందుకంటే నేరుగా ఎండ పడటం వల్ల గాడ్జెట్స్ తొందరగా వేడెక్కి పేలిపోయే అవకాశం ఎక్కువ.

*గాడ్జెట్స్ వేడెక్కినప్పుడు హ్యాంగ్ అవుతూ యాప్స్ పని చేయవు. అప్పుడు కూడా వాటిని వాడొద్దు. ఎందుకంటే.. వాటిలో ఉన్న సాఫ్ట్ వేర్  దెబ్బతిని అవి మొత్తానికే పనిచేయకుండా పోతాయి లేదా కాలిపోతాయి.

*ఛార్జింగ్ పెట్టినప్పుడు, ఎక్కువగా వాడినప్పుడు, ఎండలో ఉన్నప్పుడు ఎలా వేడెక్కినా అవి నార్మల్ టెంపరేచర్కు వచ్చే వరకు ఆగాలి. ఆ తరువాతే వాడాలి. దానివల్ల బ్యాటరీ డ్యామేజ్ కాదు.