అరి మూవీ ఫస్ట్ లుక్

అరి మూవీ ఫస్ట్ లుక్

వినోద్ వర్మ, సూర్య పురిమెట్ల, అనసూయ, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ ప్రధానపాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘అరి’. మై నేమ్ ఈజ్ నో బడీ అనేది ట్యాగ్‌‌ లైన్. ‘పేపర్ బాయ్’ ఫేమ్ జయశంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీనివాస్ రామిరెడ్డి, తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, శేషు మారంరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి వినోద్ వర్మ క్యారెక్టర్ ఫస్ట్‌‌లుక్‌‌ను బుధవారం విడుదల చేశారు.

ఓ పెద్ద లైబ్రరీలో ఏవో ముఖ్యమైన విషయాలను నోట్ చేసుకుంటున్నట్టుగా ఉన్న పోస్టర్‌‌‌‌ ఆసక్తికరంగా ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ రిలీజ్ డేట్‌‌ను త్వరలో ప్రకటించనున్నారు. వైవా హర్ష, శ్రీనివాస రెడ్డి, చమ్మక్ చంద్ర, శుభలేక సుధాకర్ ఇతరపాత్రలు పోషిస్తున్నారు.