పనికిమాలిన వేస్ట్ ఫెలోస్.. ట్రోలర్స్ పై ఫైర్ ఆయిన అరియానా

పనికిమాలిన వేస్ట్ ఫెలోస్.. ట్రోలర్స్ పై ఫైర్ ఆయిన అరియానా

బిగ్ బాస్(Bigg boss) బ్యూటీ అరియానా గ్లోరీ(Ariyana glory) ఫైర్ అయ్యారు. గత వారం రోజులుగా తనపై, తన పెర్సినాలిటీ పై వస్తున్న కామెంట్స్, ట్రోల్ల్స్ కు సోషల్  మీడియా వేదికగా కౌంటర్ ఇచ్చారు. అరేయ్ పనికిమాలిన వెదవలు అంటూ..రెచ్చిపోయారు. ప్రస్తుతం అరియానా మాట్లాడిన ఈ వీడియోలో నెట్టింట వైరల్ గా మారింది. 

ఇంతకీ నెటిజన్స్ ఆమెను ఎందుకు ట్రోల్ చేశారంటే.. రీసెంట్ గా అరియానా షేర్ చేసిన ఫొటోస్ అండ్ వీడియోస్ లో ఆమె కాస్త బొద్దుగా, లావుగా కనిపించింది. దాంతో నెటిజన్స్ ఆమెను ఇలా తయారయ్యావెంటి.. ఆంటీలా ఉన్నావ్ అంటూ కామెంట్స్, ట్రోల్స్ చేశారు. వాటిపై తాజాగా స్పదించారు అరియానా.. పనీపాటా లేని వేస్ట్ ఫెలోస్ కోసమే ఇది. సన్నగా ఉన్నప్పుడు ఏంటి ఇంత సన్నగా ఉన్నావ్ అన్నారు. లావు అయితే ఏంటి లావయ్యావ్ ఆంటీలా ఉన్నావ్ అంటూ కామెంట్స్ చేస్తారు. నేను ఎలా ఉంటె నీకు ఎందుకురా.. అసలు నువ్వెలా ఉంటావ్.. ధైర్యంగా ఒక పోస్ట్ పెట్టు. నన్ను చూడటం అంత ఇబ్బందిగా ఉంటే అన్ ఫాలో చెయ్. కనీసం నా లైఫ్ లో నేను ప్రోగ్రస్ అవుతున్నా. నువ్వేం చేస్తున్నావ్ రా.. పనీపాటా లేకపోతే ముందు ఏదైనా పని చూసుకుకో అంటూ.. ట్రోలర్ ని కడిగిపారేసింది అరియనా.