యాక్షన్ కింగ్ అర్జున్ నటించిన లేటెస్ట్ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘బ్లాస్ట్ జోన్’. ఈ థ్రిల్లర్ మూవీ బాక్సాఫీస్ వద్ద అనూహ్య విజయాన్ని నమోదు చేస్తోంది. గురువారం మే 28, 2026న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం, ఫస్ట్ వీకెండ్లోనే ప్రపంచవ్యాప్తంగా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. తమిళంలో థియేటర్లు పెంచడమే కాకుండా, ఎక్కడ చూసిన హౌస్ ఫుల్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా ప్రమోషన్స్ లేకపోయినా, ప్రేక్షకుల నుంచి వచ్చిన పాజిటివ్ మౌత్ టాక్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది.
సోమవారం కూడా అదిరిపోయిన వసూళ్లు
సాధారణంగా సినిమాలకు తొలి రోజు తర్వాత కలెక్షన్లు తగ్గడం కనిపిస్తుంటుంది. అయితే ‘బ్లాస్ట్’ విషయంలో పరిస్థితి భిన్నంగా ఉంది. విడుదలైన ఐదో రోజు (మొదటి సోమవారం) సాధించిన వసూళ్లు, ఓపెనింగ్ డే కలెక్షన్ల కంటే ఎక్కువగా ఉండటం విశేషం. యాక్షన్ థ్రిల్లర్ చిత్రాలకు ఇలాంటి ట్రెండ్ అరుదుగా కనిపిస్తుంది. ఇది సినిమాకు బలమైన మౌత్ టాక్ పెరుగుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
తొలి 5 రోజుల్లో రూ.28 కోట్ల గ్రాస్...
బాక్సాఫీస్ రిపోర్టుల ప్రకారం, ‘బ్లాస్ట్’ తొలి ఐదు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.28 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇండియా వైడ్ గా ఈ చిత్రం రూ.19.4 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు సమాచారం. ఈ వసూళ్లతో ఇటీవలి కాలంలో మంచి ప్రదర్శన కనబరిచిన యాక్షన్ చిత్రాల జాబితాలో ‘బ్లాస్ట్’ మూవీ చోటు దక్కించుకుంది.
రూ.50 కోట్ల క్లబ్ వైపు దూకుడు..
ప్రస్తుత ట్రెండ్‌ను బట్టి చూస్తే, ‘బ్లాస్ట్’ తన పూర్తి థియేట్రికల్ రన్లో రూ.50 కోట్ల మార్క్‌ను దాటే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. సెకండ్ వీక్ లో కూడా ఇదే స్థాయిలో ఆడియన్స్ ను రప్పించగలిగితే, ఫైనల్ రన్ వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లోనూ సూపర్ రెస్పాన్స్..
తెలుగులో ‘బ్లాస్ట్ జోన్’ పేరుతో విడుదలైన ఈ చిత్రం మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. అర్జున్‌కు దక్షిణాది ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్, యాక్షన్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కలిసిన కథ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. మల్టీప్లెక్స్‌లతో పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లలోనూ ఆక్యుపెన్సీ స్థిరంగా ఉండటం సినిమాకు ప్లస్‌గా మారింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ‘సితార’ నాగవంశీ రిలీజ్ చేశారు. అయితే ప్రమోషన్ పెద్దగా లేకపోవడంతో ‘బ్లాస్ట్ జోన్’ కి ఫస్ట్ డే అనుకున్న స్థాయిలో ఓపెనింగ్స్ రాలేదు. కానీ, ఆ తర్వాత కలెక్షన్స్ మెల్లగా పెరుగుతూ వస్తున్నాయి.
Blast of Entertainment 💣
— Sithara Entertainments (@SitharaEnts) June 2, 2026
Blast of Action 🔥
Blast of Fun 🤩 #BlastZone is a #BlastbusterHit!
Running successfully in cinemas near you. Book your tickets now. pic.twitter.com/IX5fFl7ttB
‘బ్లాస్ట్ జోన్’ తెలుగు టార్గెట్ ఎంత?
బ్లాస్ట్ జోన్’ (తెలుగు వెర్షన్) రూ.1.8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఈ క్రమంలోనే ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ అయ్యేసరికి రూ.1.0 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. గ్రాస్ పరంగా రూ.1.76 కోట్లు రాబట్టింది. ఇంకా బ్రేక్ ఈవెన్ రాబట్టాలంటే మరో రూ.80 లక్షల నెట్ వసూళ్లు రాబట్టాల్సి ఉంది. మొత్తానికి, మంచి కంటెంట్‌కు తెలుగు ఆడియన్స్ బ్రహ్మరథం పడతారనే విషయాన్ని ‘బ్లాస్ట్ జోన్’ మరోసారి నిరూపిస్తోంది. ఇక సెకండ్ వీక్ ఎలాంటి వసూళ్లు ఉంటాయో చూడాలి.
కథేంటంటే?
అర్జున్, ఆయన భార్య అభిరామి, కూతురు నీల (ప్రీతి ముకుందన్) బయట ప్రపంచానికి చాలా సాదాసీదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలా కనిపిస్తారు. కానీ, ఈ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ వింటే రౌడీల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ఎందుకంటే ఈ ముగ్గురూ కిల్లర్ 'కరాటే మాస్టర్లే'. కూతురు నీలను చిన్నప్పటి నుంచే సమాజంలో ఒంటరిగా పోరాడేలా, ధైర్యంగా పెంచుతారు. అయితే, ఊహించని విధంగా ఓ పెద్ద బిజినెస్ మ్యాన్, లోకల్ గూండాతో ఈ ఫ్యామిలీకి గొడవ మొదలవుతుంది. తమ జోలికి వచ్చిన ఆ గ్యాంగ్‌స్టర్స్‌ను ఈ సైలెంట్ అండ్ వయలెంట్ ఫ్యామిలీ ఎలా బ్లాస్ట్ చేసింది? అసలు ఆ గూండాల వెనుక ఉన్న అసలు సూత్రధారి ఎవరు? అనేదే మిగతా ఇంట్రెస్టింగ్ స్టోరీ.
