కమెడియన్ కొడుకుతో అర్జున్ కూతురు పెళ్లి

కమెడియన్ కొడుకుతో అర్జున్ కూతురు పెళ్లి

యాక్షన్​ కింగ్​ అర్జున్(Arjun)​ కుమార్తె, కోలీవుడ్​ హీరోయిన్​ ఐశ్వర్య అర్జున్(Aishwarya Arjun)​ పెళ్లిపీటలెక్కనుంది. తమిళ కమెడియన్​ తంబి రామయ్య(Thambi Ramayya) కొడుకు ఉమాపతి(Umapathi)తో ఐశ్వర్య ప్రేమలో ఉందని ఎప్పటినుంచో వార్తలు గుప్పుమంటున్నాయి. తాజాగా వీరిద్దరి పెళ్లికి ఇరు కుటుంబాలు గ్రీన్​ సిగ్నల్​ ఇవ్వడంతో ఎంగేజ్​మెంట్​కు సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఈ మేరకు కోలీవుడ్​ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

అర్జున్​ ఇద్దరు కుమార్తెల్లో ఐశ్వర్య పెద్దమ్మాయి. తన కుమార్తెను నటిగా నిలబెట్టేందుకు ఈ సీనియర్​ హీరో ఎంతోకాలంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. తానే డైరెక్టర్​గా మారి కుమార్తెను హీరోయిన్​గా పెట్టి సినిమా తీసినా అది హిట్టవ్వలేదు. ఇప్పుడు హీరో ఉపేంద్ర అన్న కొడుకుతో మరో సినిమాకు ప్లాన్​ చేశాడు. ఇక ఉమాపతి సైతం తమిళ్​లో ఇప్పుడిప్పుడే తన మార్కెట్​ను పెంచుకుంటున్నాడు.