చట్ట ప్రకారమే అర్నాబ్ గోస్వామి అరెస్ట్: సంజయ్ రౌత్

చట్ట ప్రకారమే అర్నాబ్ గోస్వామి అరెస్ట్: సంజయ్ రౌత్

రిపబ్లిక్ టీవీ అధినేత అర్నాబ్ గోస్వామిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనను ఎడిటర్స్ గిల్డ్, జర్నలిస్ట్ యూనియన్ ఖండించాయి. మరోవైపు ఈ అంశంపై స్పందించిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ .. చట్ట ప్రకారమే అర్నాబ్ ను అరెస్ట్ చేశారన్నారు.

తప్పు చేసినట్టు ఆధారాలుంటే ఎవరినైనా అరెస్ట్ చేసే అధికారం పోలీసులకు ఉంటుందని అన్నారు సంజయ్ రౌత్. ఇంటీరియర్ డిజైనర్ ఎండీ అన్వయ్ నాయక్, ఆయన తల్లి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారనే కేసులో అర్నాబ్ ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.