హనుమాన్ జయంతి ఉత్సవాలకు ఏర్పాట్లు : కలెక్టర్ యాస్మిన్ బాషా

హనుమాన్ జయంతి ఉత్సవాలకు ఏర్పాట్లు : కలెక్టర్ యాస్మిన్ బాషా

జగిత్యాల టౌన్, వెలుగు: ఏప్రిల్ 22 నుంచి 24 వరకు నిర్వహించనున్న కొండగట్టు చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ యాస్మిన్ బాషా అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ లో ఉత్సవాల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భక్తుల వాహనాల పార్కింగ్, తాగునీరు, లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయ సదుపాయాలు అందుబాటులో ఉంచామన్నారు. దీక్ష మాల విరమణకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. 

వేసవి దృష్ట్యా అవసరమైన మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అత్యవసర వైద్య సేవలు అందించేందుకు రెండు అంబులెన్సు లను సిద్ధంగా ఉంచాలన్నారు. సమావేశంలో అడిషనల్‌‌‌‌ కలెక్టర్ దివాకర, అడిషనల్‌‌‌‌ ఎస్పీ వినోద్ కుమార్, డీఎస్పీ రఘుచందర్, ఆలయ ఈవో చంద్రశేఖర్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.