కుక్కలను అక్రమంగా రవాణా చేస్తున్న ముఠా అరెస్ట్

కుక్కలను అక్రమంగా రవాణా చేస్తున్న ముఠా అరెస్ట్

అస్సాంలో కుక్కలను అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. 24 కుక్కలను రెస్క్యూ చేశారు. జోర్ హట్ జిల్లాల్లో ఈ ముఠాను అరెస్ట్ చేశారు. ముగ్గురు సభ్యుల ముఠా.. వీధి కుక్కలను ఎత్తుకెళ్లి.. నాగాలాండ్ కు అక్రమంగా రవాణా చేస్తున్నట్టు గుర్తించారు. న్యూ ఇయర్, క్రిస్టమస్ నేపథ్యంలో కుక్క మాంసానికి డిమాండ్ పెరగడంతో.. వీధి కుక్కలను ఎత్తుకెళ్తున్నారని స్థానిక NGOలు చెబుతున్నారు. నాగాలాండ్ లో ఈ ఏడాది జులై నుంచి కుక్క మాంసంపై నిషేధం విధించారు. అప్పటి నుంచి అక్రమరవాణా పెరిగిందన్నారు.