ఈ సినిమాతో ఒక మంచి హీరోను ఇండస్ట్రీకి ఇవ్వబోతున్నాం

ఈ సినిమాతో ఒక మంచి హీరోను ఇండస్ట్రీకి ఇవ్వబోతున్నాం

సంతోష్ కల్వచెర్ల, క్రిషిక పటేల్ జంటగా రతన్ రిషి దర్శకత్వంలో జేమ్స్ వాట్ కొమ్ము నిర్మిస్తున్న చిత్రం ‘ఆర్టిస్ట్’. తణికెళ్ల భరణి, సత్యం రాజేష్, ప్రభాకర్, వినయ్ వర్మ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్‌‌ లాంచ్ ప్రసాద్‌‌ ల్యాబ్స్‌‌లో జరిగింది. హీరో సంతోష్ మాట్లాడుతూ ‘చిన్న ప్రాజెక్ట్‌‌గా స్టార్ట్ అయిన ఈ చిత్రంలో  పెద్ద ఆర్టిస్టులు నటించడం ఆనందంగా ఉంది.

గ్లింప్స్‌‌లాగే సినిమా కూడా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది’ అన్నాడు.  అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్ చెప్పింది క్రిషిక. రతన్ మాట్లాడుతూ ‘గ్లింప్స్ చూస్తే ఇది థ్రిల్లర్‌‌‌‌గా అనిపిస్తుంది.  కానీ ఇందులో లవ్, ఎమోషన్, కామెడీ వంటి అన్ని షేడ్స్ ఉంటాయి. డార్క్ కామెడీలా ఉంటుంది. ఇందులో హీరో వైలెంట్‌‌గా ఉంటాడు’ అని చెప్పాడు. ‘ఈ సినిమాతో ఒక మంచి హీరోను ఇండస్ట్రీకి ఇవ్వబోతున్నాం.

హీరోయిన్ క్రిషిక కూడా టాలెంటెడ్ ఆర్టిస్ట్. ఈ చిత్రం మా అందరికీ హిట్ ఇస్తుందని ఆశిస్తున్నాం’ అన్నారు నిర్మాత. నటులు భద్రం, తాగుబోతు రమేష్, కిరీటి,  మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి పాల్గొన్నారు.