ఎన్డీఏతో పొత్తు పెట్టుకోం.. బీజేపీ ఎప్పటికీ మా సైద్ధాంతిక శత్రువే: టీవీకే చీఫ్ విజయ్ క్లారిటీ

ఎన్డీఏతో పొత్తు పెట్టుకోం.. బీజేపీ ఎప్పటికీ మా సైద్ధాంతిక శత్రువే: టీవీకే చీఫ్ విజయ్ క్లారిటీ

ఎన్డీఏతో పొత్తుపై టీవీకే చీఫ్ విజయ్ క్లారిటీ ఇచ్చారు. వారితో ఎలాంటి అలయన్స్ ఉండదని స్పష్టం చేశారు. దీనిపై జరుగుతున్న చర్చంతా పుకార్లేనంటూ కొట్టి పారేశారు. ఎన్డీఏతో పొత్తుకు చాన్స్ లేదని.. బీజేపీ ఎప్పటికీ తమ సైద్ధాంతిక శత్రువు అని శనివారం (మార్చి 14)  పేర్కొన్నారు. ప్రజల సమస్యల నుంచి అందరి దృష్టిని మళ్లించే లక్ష్యంతో రోజుకో పుకారు వ్యాప్తి చెందిస్తున్నారని మండిపడ్డారు. ఊహాగానాలను ఎవరూ నమ్మవద్దని, పార్టీ అధికారిక ప్రకటనను అనుసరించాలని విజ్ఞప్తి చేశారు.

విజయ్ పార్టీ పెట్టిన తర్వాత ఒకదాని తర్వాత ఒక ఎదురుదెబ్బ అన్నట్లుగా ఘటనలు జరిగాయి. ర్యాలీలో తొక్కిసలాట, సినిమా విడుదల వాయిదా, భార్య విడాకుల వివాదం. కీలకమైన దశలో కుటుంబ కలహాలు రావడంతో విజయ్ కొన్నాళ్లుగా సైలెంట్ అయిపోయారు. ఈ క్రమంలో విజయ్ కి ఇక ఆప్షన్ లేదని.. ఎన్డీఏలో జాయిన్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చిందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో విజయ్ ను ఎన్డీఏలో చేర్పించేందుకు.. ఎన్డీఏ సహచర పార్టీ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు టాక్. బీజేపీ అలయన్స్ లో ఆంధ్రప్రదేశ్ లో అధికారానికి వచ్చిన తీరును వివరించి.. విజయ్ ను పవన్ ఒప్పిస్తారని భావిస్తున్నారు. ఇలాంటి ఊహాగానాల మధ్య ఎన్డీఏలో చేరేది లేదని విజయ్ చెప్పడం చర్చనీయాంశంగా మారింది. 

►ALSO READ | PTMలో పేరంట్స్ గా నటిస్తారా.. 15 వేలు ఇస్తా : SMలో పోస్ట్ పెట్టిన కుర్రోడు..!

రాజకీయాల్లోకి విజయ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత తమిళ రాజకీయ ముఖచిత్రం మారిపోయిందనే చెప్పాలి. తిరుగులేని శక్తిగా ముందుకు సాగుతున్న డీఎంకేను కొట్టడానికి ప్రయత్నిస్తున్న బీజేపీ అది ఇప్పటి వరకు కుదరలేదు. అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకున్నా సాధ్యపడలేదు. అదే సమయంలో.. దాదాపు డీఎంకే ఐడియాలజీతోనే వచ్చిన టీవీకే విజయ్ ని ఉపయోగించాలని.. ద్రవిడ నాట కాషాయ జెండా పాతాలని బీజేపీ భావిస్తోంది.