కాగజ్ నగర్: ఆఫీసర్లకు సమావేశానికి వచ్చే సమయం లేదా? : జిల్లా గ్రంథాలయ చైర్మన్ కాంబ్లే అనిల్

కాగజ్ నగర్: ఆఫీసర్లకు సమావేశానికి వచ్చే సమయం లేదా? : జిల్లా గ్రంథాలయ చైర్మన్ కాంబ్లే అనిల్
  •     మండల పరిషత్ సమావేశంలో గ్రంథాలయ చైర్మన్​ అనిల్​ అసంతృప్తి 

కాగజ్ నగర్, వెలుగు: ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న మండల పరిషత్ సమావేశానికి మండల స్థాయి అధికారులు హాజరు కాకపోవడం, వచ్చిన వాళ్లలో కొండలు కిందిస్థాయి అధికారులు ఉండడం బాధాకరమని ఆసిఫాబాద్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ కాంబ్లే అనిల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం కౌటాల ఎంపీడీవో ఆఫీస్ లో నిర్వహించిన మండల ప్రజా పరిషత్ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సిద్ధల దేవయ్యతో కలిసి పాల్గొన్నారు. 

కీలకమైన మీటింగ్ లో సర్పంచులకు కనీసం నివేదికలు ఇవ్వకపోవడం అధికారుల  బాధ్యతారాహిత్యమేనని అన్నారు. ప్రభుత్వ విధాన నిర్ణయాలు, పథకాలు, ప్రజల సమస్యల పరిష్కారం కోసం లెటర్లు రాసేలా చొరవ చూపాలని సూచించారు. గెజిట్ ద్వారా నిర్వహిస్తున్న ఈ సమావేశాలకు ఖచ్చితంగా ఆయా శాఖల ముఖ్య అధికారులు రావాలని సూచించారు. ఈ సందర్భంగా వివిధ అభివృద్ధి శాఖలపై చర్చించారు. ఎంపీడీవో ప్రసాద్, సహకార సంఘం చైర్మన్ మాంతయ్య తదితరులు పాల్గొన్నారు.