జ్యోతిష్య శాస్రం ప్రకారం నవగ్రహాలు ఎప్పటికప్పుడు వాటి స్థానాలు మారుతుంటాయి. పండితులు తెలిపిన వివరాల ప్రకారం సౌర కుటుంబంలోని అన్ని గ్రహాలు మానవ శరీరంపై ప్రభావం చూపుతాయి. ప్రతి గ్రహానికి శరీరంలోని ఒక్కో ప్రత్యేక ప్రాంతానికి సంబంధం ఉంటుంది. వీటిని స్థితి అనుకూలంగా ఉంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. అదే వీటి స్థితి బలహీనంగా ఉంటే అనారోగ్యం బారిన పడతారు. జాతకంలో ఏ గ్రహం బలహీనంగా ఉంటే ఎలాంటి ఇబ్బందులు వస్తాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . . .!
సాంకేతికంగా సూర్యుడు వెలుగు, వేడి ప్రసాదింస్తాడు. సూర్యుని నుంచి గ్రహించే శక్తి భౌతిక, మానసిక చర్యలే కాదు గుండె పనితీరును కూడా సూచిస్తుంది. వ్యక్తుల జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉన్న.. అశుభ దృష్టి చూసిన అశాంతి ఏర్పడుతుంది. మానసిక సమస్యలు.. తరుచూ భౌతికంగా ఇబ్బందులు రావడం.. గుండె పనితీరు విషయంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
సూర్యుడికి చంద్రుడు విరుద్ధం. శరీరానికి చల్లదనం, బలం, సమతౌల్యాన్ని చంద్రుడు అందిస్తారు. జీర్ణక్రియ, అధిక ఉప్ణం నుంచి ఉపశమనం, శరీరంలోని రక్త ప్రసరణ అనేవి చంద్రుడి ప్రసాదించే శక్తిపై ఆధారపడి ఉంటాయి. చంద్రుడి దృష్టి సరిగా లేకపోతే.. అలాంటి వారు తరచూ ఆవేశానికి గురవుతారు. అలసర.. గ్యాస్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. తరచూ జ్వరం రావడం.. బ్లడ్ సర్క్యులేషన్ విషయంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
సౌర కుటుంబంలోని ప్రకాశవంతమైన గ్రహాల్లో బుధ గ్రహాం కూడా ఒకటి. మెదడు పనితీరు, తెలివితేటలు, నిర్ణయాలు తీసుకునే సామర్ధ్యం బుధుడిపై ఆధారపడి ఉంటుంది. బుధుడు వక్ర దృష్టితో ఉంటే ఏ విషయంలో కూడా నిర్ణయం తీసుకోలేదు. ఆలోచనశక్తి లోపిస్తుంది. ఏ విషయం కూడా గుర్తుండదు.. ప్రతి పనిని కూడా పదే పదే చేయాల్సి ఉంటుంది.
శుక్రుడు ప్రేమకు చిహ్నం. ఈ గ్రహ స్థితి సాధారణంగా ఉంటే శరీరంలో చక్కెర నిల్వల్లో సమతౌల్యత ఉంటుంది. బలహీనంగా ఉంటే డయాబెటిస్‌కు దారి తీస్తుంది. శుక్రుడు ఐశ్వర్యానికి కారకుడు. శుక్ర గ్రహం సరిగా లేక తియ్యటి వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ఇంకా అనవసరంగా డబ్బు ఖర్చు అవడం.. తరుచు వైద్యం చేయించుకోవడం వంటివి జరుగుతుంటాయని పండితులు చెబుతున్నారు.
కిడ్నీల పనితీరు, మూత్రాశయం, క్లోమం పనితీరు కుజ గ్రహంపై ఆధారపడి ఉంటుంది. అలాగే రక్త ప్రసరణ పనితీరును కూడా ఇది నియంత్రిస్తుంది. గ్రహ స్థితి బలహీనంగా ఉంటే ఉదర సంబంధ వ్యాధులకు కారణమవుతుంది.
సౌర వ్యవస్థలో అతి పెద్ద గ్రహం బృహస్పతి. భౌతిక సామర్థ్యం, బలం, హృదయం పనితీరు కూడా దీనిపై ఆధారపడి ఉంటుంది. జాతకంలో ఈ గ్రహం బలహీనంగా ఉంటే నీరసం, గుండె సంబంధ రోగాలకు దారితీస్తుంది.
శరీరంలోని విటమిన్లు, ఖనిజ లవణాలు సమతౌల్యతకు, శని గ్రహానికి సంబంధం ఉంటుంది. ఎముకల గట్టిదనం, శరీరంలో కాల్షియం స్థాయిలను కూడా ప్రభావితం చేస్తుంది. ఈ గ్రహం బలహీనంగా ఉంటే శరీరంలో పగుళ్లు ఏర్పడతాయి. ఇంకా అనేక కష్టాలు కలుగుతాయి.
జ్యోతిష్య శాస్రం ప్రకారం గ్రహాల చలనం, స్థాన మార్పిడి వ్యక్తి మీద ప్రభావం చూపుతాయి. జాతకంలో ఏ గ్రహం వక్ర దృష్టితో ఉందో పండితులు తెలిపిన వివరాల ప్రకారం పరిహారాలు చేయాలి. ఇలా చేయడం వలన పూర్తిగా దోషం తొలగదు కాని.. ఉపశమనం కలుగుతుంది. కర్మ ఫలాన్ని ఎవరూ తప్పించలేరు కాని.. పరిహారాల ద్వారా తగ్గుతుందని పండితులు చెబుతున్నారు.
