జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. మనం పుట్టిన తిథి.. వారము..నక్షత్రం ఆధారంగా రాశిని నిర్దేశిస్తారు, ప్రతి రాశికి ఒక్కొక్క జీవి సింబల్ గా ఉంటుంది. పండితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏ రాశిలో జన్మిస్తారో ఆ రాశిని సూచించే సింబల్ ఆధారంగా వారి జీవితం కొనసాగుతుంది. 12 రాశులకు ఉండే సింబల్స్ ఏమిటి.. ఏరాశిని ఏ జంతువు శాసిస్తుంది.. ఎవరు ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటారో ఈ స్టోరీలో తెలుసుకుందాం. .!
మేష రాశి : ఈ రాశిని గొర్రె పొట్టేలుతో సూచిస్తారు. సాధారణంగా పొట్టేలుకు ధైర్యం ఎక్కువుగా ఉంటుంది. వంకర తిరిగిన కొమ్ములతో దూకుడుగా గ్రూప్ లీడర్ గా ఉంటుంది. అందుకే మేకలు.. గొర్రెల సమూహాలు వెళ్లే టప్పుడు.. ముందు పొట్టేలు వెళుతుంటే మిగతావి దానిని అనుసరిస్తుంటాయి. అందుకే మేషరాశి వారు ఎక్కువ మంది నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. వీరు అనుకున్న పనిని ఎంత కష్టమైన సాధించాలనే తపన కలిగి ఉంటారు. అంటే ప్రతి విషయంలో కూడా పొట్టేలు మాదిరిగా దూసుకుపోయే లక్షణాలు ఈ రాశి వారిలోనూ కనిపిస్తుందని జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుస్తుంది.
వృషభ రాశి : ఈ రాశిని ఎద్దు సింబల్ తో సూచిస్తారు. ఎద్దు చాలా స్పీడ్ గా పరిగెడుతుంది. చాలా ప్రశాంతంగా ఉండి దాని పని అది చేసుకుంటుంది. కాని అనవసరంగా దాని జోలికి వెళ్తే మాత్రం వారికి చుక్కలు చూపిస్తుంది. చాలా మంది ఎద్దు దగ్గరకు వెళ్లాలంటే భయపడతారు. అందుకే ఈ రాశి వారు ఎద్దులాగే అత్యంత పట్టుదల, కష్టపడే తత్వం కలిగి ఉంటారు. వీరు సాధారణంగా చాలా శాంతంగా ఉంటారు, కానీ ఎవరైనా వీరిని పదే పదే రెచ్చగొడితే మాత్రం ఎద్దులాగే విరుచుకుపడతారు.
మిథున రాశి : ఈ రాశి వారిని ఎగిరే పక్షులతో పోలుస్తారు. జంట పక్షులు.. జంట మనుషుల సింబల్. సాధారణంగా వీరు చాలా స్పిరిట్ గా ఉంటారు. వీరు చాలా ఎక్కువటైం మాట్లాడుతుంటారు. వీరు చిలుకల మాదిరిగా ఇతరులను ఆకట్టుకుంటారు. చాలా చురుగ్గా ఉంటడంతో కమ్యూనికేషన్ స్కిల్స్ ఈ రాశి వారికి ఎక్కువుగా ఉంటాయి.
కర్కాటక రాశి: ఈ రాశికి సింబల్ పీత.. ఈ రాశికి చెందిన వారు పైకి గంభీరంగా ఉంటారు. కాని మనసులో మాత్రం ఆందోళన,, భావోద్వేగంతో ఉంటారు. చాలా సున్నితంగా ఉన్నప్పటికి.. భయం.. ఆవేదనను పైకి కనపడకుండా చాలా ధైర్యంగా ఉన్నట్టు నటిస్తారు. అందుకే పీతకు పైన గట్టి పెంకు ఉంటుంది.
సింహ రాశి : ఈ రాశి పేరులోనూ ఉన్నట్లుగా సిహంతో సూచిస్తారు. ఈ రాశి వారు ఎక్కడికి వెళ్లినా అందరి దృష్టిని ఆకర్షిస్తారు. రాజు వలె వ్యవహరిస్తారు. రాజసం ఉట్టి పడేలా అందరికి దిశా నిర్దేశం చేస్తారు. ఈ రాశి వారు చాలా ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. అడవికి రాజు సింహమే కదా మరి..!
కన్యా రాశి : ఈ రాశికి కన్య సింబల్ సంకేతంగా ఉంటుంది. జంతు శాస్త్రంలో కన్యను ఎలుగుబంటి లేదా నక్క తో పోలుస్తారు. అందుకే వాటి మాదిరిగా ఈ రాశి వారు వీరు ప్రతి విషయాన్ని చాలా నిశితంగా గమనిస్తారు, పక్కా ప్లానింగ్‌తో ఉంటారు క్రమశిక్షణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. సాధారణంగా మహిళల ప్లాన్ ప్రకారం జరిగే ఇళ్లలో అంతా క్రమశిక్షణ కలిగి ఉంటారు.
తులా రాశి: 12 రాశుల్లో ప్రాణం లేని సింబల్ ను సూచిస్తుంది. ఈ రాశికి త్రాసు త్రాసు’ సింబల్‌గా ఉంటుంది. జంతువుల పరంగా చూస్తే వీరు సమానత్వాన్ని, అందాన్ని ఇష్టపడే హంస లాంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. జీవితంలో ఎల్లప్పుడూ బ్యాలెన్స్ ను కోరుకుంటారు. అందుకే ఈ రాశి వారికి పెద్దగా అప్పులు ఉండవు.. ఆదాయానికి తగిన విధంగా ప్లాన్ చేసుకుంటారు. చాలా తెలివితేటలతో సమయస్ఫూర్తిని కలిగి ఉంటారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
వృశ్చిక రాశి : ఈ రాశికి సింబల్ తేలు . ఈ రాశి వారు ప్రతి విషయంలో కూడా సీక్రసీ మెయిన్ టెన్ చేస్తారు. వీరి మనస్సులో ఏముందో ఊహించడం చాలా కష్టం.. ఒకటి చెపితే మరొకటి చేస్తారు. ఈ రాశి వారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నమ్మకద్రోహం చేసిన వారిని వీరు అంత సులభంగా వదిలిపెట్టరు. వీరు తేలులాగే తమ ఆత్మరక్షణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.
ధనస్సు రాశి: ఈ రాశిని బాణం పట్టుకున్న మనిషి .. లేదా గుర్రం అనే సింబల్స్ తో సూచిస్తారు. ప్రతి పనిలో కూడా బాణం మాదిరిగా దూసుకుపోతారు. వీరి లక్ష్యాన్ని చేరుకునేందుకు గుర్రం మాదిరిగా పరిగెడతారు. ఈ రాశి వారు ఎక్కువుగా ఫ్రీడమ్ ను కోరుకుంటారు. ఎప్పటి కప్పుడు కొత్త విషయాలను నేర్చుకొనేందుకు ఎక్కువుగా ఇష్టపడతారు.
మకర రాశి : ఈ రాశికి మొసలి లేదా సముద్రపు మేక సంకేతంగా ఉంటుంది. ఈ రాశి వారు అత్యున్నత పదవి కోసం ఆరాటపడుతుంటారు. ప్రతి విషయంలో కూడా పై స్థాయిలో ఉండాలని కోరుకుంటారు. కెరీర్‌లో చాలా ప్రాక్టికల్ గా ఆలోచించి గౌరవ ప్రదమైన హోదా పొందేందుకు ఎంతటి కష్టాన్నైనా ఓర్చుకుంటారు. అప్పటి వరకు చాలా ఓపికకగా ఉంటారు. ఈ రాశి వారు మొసలి పట్టు మాదిరిగా ప్రతి విషయాన్ని పట్టుదలతో సాధిస్తారు.
కుంభ రాశి: ఈ రాశికి నెమలి లేదా కడవతో నీరు పోసే వ్యక్తి సింబల్‌గా ఉంటాడు. ఈ రాశి వారు ప్రతి విషయంలో కూడా వినూత్నంగా ఆలోచిస్తారు. సమాజం కోసం శ్రమిస్తుంటారు. ఈ రాశి వారితో కలిసి పనిచేసేవారి యోగ క్షేమాల గురించి ఆలోచిస్తుంటారు. జంతు ప్రపంచంలోనెమలి స్వభావాన్ని కలిగి ఉంటారు.
మీన రాశి : ఈ రాశికి ఈదే రెండు చేపలు సంకేతంగా ఉంటాయి. ఈ రాశి వారు ఊహల ప్రపంచంలో గడుపుతారు. ఎక్కువుగా ఆధ్యాత్మిక విషయాల గురించి ఆశక్తి చూపుతారు. పుణ్యక్షేత్రాలను దర్శించాలంటే ముందువరుసలో ఉంటారు.ఇతరుల బాధను అర్దం చేసుకొనే వ్యక్తిత్వం కలిగి ఉంటారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనంలోని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
