జ్యోతిష్యం : జూన్15 బిగ్ డే... అమావాస్య రోజు ఒకే రాశిలో సూర్యుడు.. చంద్రుడు.. ఆరు రాశుల వారికి పక్కాగా జరిగేది ఇదే..!

జ్యోతిష్యం :  జూన్15  బిగ్ డే... అమావాస్య రోజు ఒకే రాశిలో సూర్యుడు.. చంద్రుడు.. ఆరు రాశుల వారికి పక్కాగా జరిగేది ఇదే..!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం  అధిక జ్యేష్ఠ మాసం అమావాస్య ( జూన్​ 15)  ఘడియల్లో వృషభ రాశిలో సూర్యుడు, చంద్రులు కలవనున్నారు.   చంద్రుడు ఉచ్ఛస్థితిలో ఉండటం వలన ఈ అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఉందని పండితులు చెబుతున్నారు.  దీని కారణంగా  జూన్ 14, 15, 16 తేదీల్లో దీని ప్రభావం బలంగా ఉన్నప్పటికినీ .. తదుపరి పౌర్ణమి వరకు  అంటే  జులై  29 వరకు ఆరు  రాశుల  వారికి(మేషం, వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకర రాశుల)  ఊహించని శుభ ఫలితాలు కలిగే అవకాశాలున్నాయని చెబుతున్నారు.  ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.. 

తెలుగు పంచాగం ప్రకారం  అధిక జ్యేష్ఠ మాసం మరో నాలుగు రోజుల్లో ( జూన్​ 11 నాటికి)  ముగుస్తుంది. కొనసాగుతుంది.  వేద క్యాలండర్​ ప్రకారం ఈ ఏడాది (2026)  జూన్ 15న అధిక జ్యేష్ఠ  అమావాస్య  తిథి. ఆ రోజు సంభవించనున్న అమావాస్యకు జ్యోతిష్యపరంగా ప్రత్యేక ప్రాధాన్యం ఉందనిపండితులు చెబుతున్నారు.

అధికజ్యేష్ఠమాసం అమావాస్య  తేది మరియు సమయం వివరాలు

  • అధిక జ్యేష్ఠమాసం అమావాస్య తేది : 2026  జూన్ 15 సోమవారం
  • అమావాస్య ప్రారంభం:  జూన్ 14 ఆదివారం  ఉదయం 11:43 గంటలకు 
  • అమావాస్య ముగింపు: జూన్ 15 సోమవారం ఉదయం 09:17 గంటల వరకు

మేషరాశి:   అమావాస్య రోజున సూర్యుడు.. చంద్రుడు .. . ఈ రాశికి ధన స్థానంలో ఉండటం వలన  సమాజంలో గౌరవం  పెరిగే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. ఆదాయం పెరగడం ముఖ్య మైన అవసరాలు, సమస్యలు తీరిపోతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు నష్టాల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. అవకాశం ఉంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. శుభవార్తలు ఎక్కువగా వింటారు.

వృషభరాశి: ఇదే  రాశిలో చంద్రుడు ఉచ్ఛ స్థితిలో సూర్యుడితో  అమావాస్య రోజు కలవడం వల్ల ఈ రాశివారి  శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. చేపట్టిన పనుల్లో విజయం లభిస్తుంది.  కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడటంతో  ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. . ఉద్యోగంలో తప్పకుండా అధికార యోగం పడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాల జోరు పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

కర్కాటకం:ఈ రాశికి  రాశ్యధిపతి చంద్రుడు లాభ స్థానంలో..  ఉచ్ఛ స్థితిలో ఉండడం.. ధనాధిపతి అయిన సూర్యుడితో కలవడం వల్ల ఈ రాశి వారి  వ్యక్తిగత జీవితంలో  బాగా పురోగతి ఉంటుందని పండితులు చెబుతున్నారు.  ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదని పండితులు చెబుతున్నారు. విదేశాల్లో స్థిరపడాలనుకునే వారు గుడ్​ న్యూస్​ వింటారు.  ఆకస్మిక ధన లాభం కలిగే  సూచనలున్నాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. పూర్వీకుల ఆస్థి కలసి వస్తుంది.  ముఖ్యంగా బంధు వర్గంలోని వారితో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 

కన్య రాశి: భాగ్య స్థానంలో  చంద్రుడు,సూర్యుడు కలవడం వల్ల ఈ రాశివారికి అనేక విధాలుగా శుభం జరుగుతుందని పండితులు చెబుతున్నారు.  ఒక్కసారిగా ఆదాయం పెరుగుతుంది.  వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. అనారోగ్యాల నుంచి ఆశించిన ఉపశమనం లభిస్తుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. ఉన్నత స్థాయి కుటుంబంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఇంటా బయటా సుఖ సంతోషాలు నెలకొంటాయి. ఉద్యోగంలో హోదాలు, వేతనాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఏ విషయంలోనూ ఎలాంటి ఇబ్బంది ఉండదని పండితులు చెబుతున్నారు. 

వృశ్చికరాశి: ఈ రాశికి సప్తమ స్థానంలో సూర్యుడు, చంద్రులు కలవడం వల్ల జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకొనే అవకాశాలున్నాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం లభిస్తుంది. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది.  మంచి ఉద్యోగంలోకి మారే సూచనలున్నాయి. నిరుద్యోగులకు భారీ జీతభత్యాలతో కూడిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. విదేశీ అవకాశాలు కూడా అంది వస్తాయి.అనుకూలతలు బాగా పెరుగుతాయి.  వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగుతాయి. ఆర్థికంగా.. ఆరోగ్యంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని పండితులు చెబుతున్నారు.

మకరరాశి: ఈ రాశికి పంచమ స్థానంలో రవి, చంద్రుల కలయిక వల్ల జులై 29 వరకు  ఈ రాశివారి జీవితంలో అనుకోని మార్పులు సంభవించే అవకాశం ఉంది. ఉద్యోగంలో వేతనాలు, వృత్తి, వ్యాపారాల్లో లాభాలు రెట్టింపయ్యే సూచనలున్నాయి.  స్పెక్యులేషన్లు అంచనాలకు మించి లాభిస్తాయి. ఆస్తి వివాదం సానుకూలంగా పరిష్కారమై, విలువైన ఆస్తి సంక్రమిస్తుంది. వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది.  కొత్తగా ప్రాజెక్ట్​లు చేపడతారు.సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి ఖాయమవుతుందని పండితులు చెబుతున్నారు.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.