జ్యోతిష్యశాస్త్రం ప్రకారం అరుదైన ఘటన చోటుచేసుకుంది. 2026 జూన్ 29 వరకు ఖప్పర్ యోగం ఉంటుందని పండితులు చెబుతున్నారు. రెండు అత్యంతశక్తి వంతమైన గ్రహాలు శని.. రాహువులు కలిసి సంచారం చేసినప్పుడు ఖప్పర యోగం ఏర్పడుతుందని జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుస్తుంది. ఈ రెండు గ్రహాల కలయిక వలన నాలుగు రాశుల వారు జాగ్రత్తగా ఉండాలని పండితులు చెబుతున్నారు. ఆ రాశుల వారు ఎలాంటి పరిహారాలు చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒకరాశి నుంచి మరో రాశిలోని మారినప్పడు కొన్ని రాశుల వారి జీవన పరిస్థితుల విషయంలో మార్పులు కలుగుతాయి. ప్రస్తుతం శని .. రాహువు కలిసి జూన్ 29 వరకు సంచరిస్తారు. ఈ కారణంగా కొన్ని రాశుల వారికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతాయని పండితులు చెబుతున్నారు.
మేషరాశి: ఈ రాశి వారికి ఖప్పరయోగం వలన కోపం.. అసహనం పెరిగే అవకాశం ఉంది. కార్యాలయంలో కొన్ని ప్రతికూల పరిస్థితుల వలన ఆందోళన కలిగే అవకాశం ఉంది. వాహనం డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగస్తులు మీ పని మీరు చేసుకోండి. ఎవరితోనూ వాదనలు పెట్టుకోవద్దు. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చేపట్టిన పనులు ఆలస్యం కావడం.. రావలసిన డబ్బులు చేతికి అందకపోవడం.. ఖర్చులు పెరగడం వలన ఇబ్బందులు పడే అవకాశాలున్నాయి. కావున ఆర్థిక విషయాల్లో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
పరిహారం : గురువారం దక్షిణామూర్తి స్తోత్రం చదవాలి. బ్రాహ్మణులకు దక్షిణతో వస్త్రదానంచేయాలి
కన్యారాశి: ఖప్పర్ యోగం వలన ఈ రాశి వారికి ఆర్థిక విషయాల్లో ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. వ్యాపారస్తులు జూన్ 29 వరకు కొత్త పెట్టుబడులకు దూరంగా ఉండాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. చేపట్టిన పనుల్లో ఆలస్యం జరిగే అవకాశం ఉంది. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు.. ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరితోనూ వాదనలు పెట్టుకోవద్దని... ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని పండితులు సూచిస్తున్నారు. .
పరిహారం : మంగళవారం హనుమంతుడికి ఆకుపూజ చేయాలి. పేదలకు అన్నదానం చేయాలి.
వృశ్చిక రాశి: శని.. రాహువు కలయిక వలన ఈ రాశి వారికి అశాంతి కలిగే అవకాశం ఉంది. కుటుంబసభ్యుల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది. నిరంతర కుటుంబ కలహాలు, మానసిక ఒత్తిడి, మితిమీరిన పనుల వలన ఆరోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. డబ్బు విషయాల్లో, మానసిక ఆందోళనల పట్ల అప్రమత్తంగా ఉండాలి. మాట తీరు స్పష్టంగా ఉంచుకోవాలి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి.బంధుత్వాలు, స్నేహాల విషయంలో సహనం చాలఅసరమని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
పరిహారం : సోమవారం పరమేశ్వరుని అభిషేకం చేయాలి. శివాలయంలో నువ్వుల నూనెను దీపారాధనకు ఇవ్వాలి.
కుంభ రాశి: ఈ రాశికి అధిపతి శని.. రాహువుతో కలిసి ఖప్పర్ యోగం ఏర్పడటం వలన ప్రభావం కూడా పెరగడం వల్ల, ప్రతి పనిలోనూ ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీ సామాజిక ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం జరిగే అవకాశం ఉంది. తోబుట్టువులతో జాగ్రత్తగా ఉండాలి. శ్రమకు తగిన ఫలితం ఉండకపోవచ్చు. సహోద్యోగులు.. తోటి వారి పట్ల పట్ల అప్రమత్తంగా ఉండండి. గతంలో మీనుంచి సాయం పొందిన వారు.. ఇప్పుడు ముఖం చాటేస్తారు. ఉద్యోగస్తులు అనవసరంగా మాట పడాల్సి పరిస్థితులు నెలకొంటాయి. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది పెడుతుందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. ఆర్థిక క్రమశిక్షణ చాలా ముఖ్యమని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
పరిహారం : శనివారం శని భగవానుడికి నువ్వులనూనెతో అభిషేకం.. బెల్లం.. నువ్వులు కలిపి ప్రసాదంగా పంచిపెట్టాలి.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
