వారఫలాలు...ఈ రాశుల వారికి అదృష్టం

వారఫలాలు...ఈ రాశుల వారికి అదృష్టం

మేషం

స్నేహితులతో వివాదాల సర్దుబాటు. ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు. ఆదాయానికి లోటు ఉండదు. స్థిరాస్తి విషయంలో సమస్యలు క్రమేపీ తొలగుతాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ముఖ్యమైన  కార్యక్రమాలు అనుకున్న సమయానికి పూర్తి. వ్యాపారులకు తగిన లాభాలు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రావచ్చు. రాజకీయవేత్తలు, కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది.

వృషభం

చేపట్టిన కార్యాలు విజయవంతం. రాబడి ఆశాజనకం. శుభవర్తమానాలు. ఆస్తుల విషయంలో చికాకులు తొలగుతాయి. పెద్దల సలహాల మేరకు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారులు లాభాల దిశగా అడుగులు. ఉద్యోగులకు కొత్త పోస్టులు లభించే వీలుంది. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఆకస్మిక విదేశీ పర్యటనలు ఉండవచ్చు.

మిథునం

పలుకుబడి కలిగిన వారు పరిచయమై సహకరిస్తారు. ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటారు. ఇళ్లు, వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు నెమ్మదిస్తాయి. విద్యార్థులకు ఉత్సాహవంతం. ఒక దీర్ఘకాలిక సమస్య నుంచి గట్టెక్కుతారు. వ్యాపారులకు స్వల్ప లాభాలు. ఉద్యోగులకు విధుల్లో కొంత ఒత్తిడులు. పారిశ్రామిక, రాజకీయవేత్తలు, కళాకారులు మరింత శ్రమ పడాలి.

కర్కాటకం

పలుకుబడి కలిగిన వారి పరిచయం. యుక్తితో సమస్యల నుంచి బయటపడతారు. ఆస్తుల వ్యవహారాలలో లబ్ధి. ప్రత్యర్థులను కూడా ఆకట్టుకుంటారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. రాబడి సంతృప్తికరం. వాహనసౌఖ్యం. వ్యాపారులకు పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది. రాజకీయవేత్తలు, కళాకారులకు నూతనోత్సాహం.

సింహం

కొత్త వ్యూహాలతో ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటారు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఆదాయ మార్గాలు కొంత పెరిగి అవసరాలు తీరతాయి. సోదరులు, సోదరీలతో విభేదాలు కొంతవరకూ సర్దుకుంటాయి. స్థిరాస్తిపై కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు. వ్యాపారులకు లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు రావచ్చు. రాజకీయవేత్తలు, కళాకారులకు క్రమేపీ అనుకూల పరిస్థితుల. 

కన్య

వ్యయప్రయాసలు ఎదురైనా లెక్కచేయరు. బంధువర్గంతో వివాదాల సర్దుబాటు. అనుకున్న ఆదాయం సమకూరుతుంది. ఆదాయవ్యయాలు సమానం. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారులకు ఊహించని లాభాలు. ఉద్యోగులకు పనిభారం కొంత తగ్గుతుంది. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు విదేశీ పర్యటనలు ఉంటాయి.

తుల

కుటుంబంలో సమస్యల పరిష్కారం. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఆదాయానికి ఇబ్బందులు లేకుండా గడిచిపోతుంది. ఇంటి నిర్మాణాలపై కుటుంబసబ్యులతో చర్చిస్తారు. నూతన విద్య, ఉద్యోగావకాశాలు దక్కవచ్చు. వ్యాపారులకు ఒత్తిడులు తొలగుతాయి. ఉద్యోగులకు కోరుకున్న విధంగా ప్రమోషన్లు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు విదేశీ పర్యటనలు.

వృశ్చికం

పరిచయాలు విస్తృతం. ఆదాయవ్యయాలు సమానంగా ఉన్నా అవసరాలకు లోటు రాదు. ముఖ్యమైన కార్యాలు విజయవంతం. ఆప్తుల నుంచి శుభవర్తమానాలు. వాహనాలు, భూముల కొనుగోలు యత్నాలు నెమ్మదిస్తాయి. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు. ఉద్యోగులకు కొత్త పోస్టులు లభించే అవకాశాలున్నాయి. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు ఒత్తిడులు ఎదురైనా అధిగమిస్తారు.

ధనుస్సు

పరిస్థితులు కొంతమేర అనుకూలిస్తాయి. ఆదాయం ఆశాజనకం. సన్నిహితులతో వివాదాల పరిష్కారం. విద్యార్థులకు ఊహించని అవకాశాలు. విదేశీ విద్యావకాశాలు దక్కవచ్చు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వేడుకలకు హాజరవుతారు. వ్యాపారులకు గతం కంటే మెరుగైన లాభాలు. ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. రాజకీయవేత్తలు, కళాకారులకు కొంత గందరగోళం.

మకరం

కొత్త కార్యక్రమాలు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఊరటనిస్తాయి. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వాహనాలు, గృహం కొంటారు. కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. ఎంతటి వారినైనా వాక్చాతుర్యంతో ఆకట్టుకుంటారు. వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు విధుల్లో ప్రశంసలు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఆహ్వానాలు.

కుంభం

అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. యుక్తి, నేర్పుతో కొన్ని వివాదాల పరిష్కారం. ఆశ్చర్యకరమైన సంఘటనలు. ఆశించినంత ఆదాయం సమకూరుతుంది. కొత్త వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. కొన్ని వేడుకలకు హాజరవుతారు. స్థిరాస్తులపై సోదరులతో వివాదాల పరిష్కారం. వ్యాపారులకు ఊహించని లాభాలు. ఉద్యోగులకు ప్రమోషన్లు దక్కుతాయి. 

మీనం

మీ పట్ల వ్యతిరేకభావం కలిగిన వారు సైతం అనుకూలురుగా మారతారు. ఆదాయం ఆశాజనకం. పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం. ఆత్మీయుల సలహాలతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అనుకున్నంత ఆదాయం. వాహనాలు, స్థలాలు కొంటారు. వ్యాపారులకు ఆశించిన లాభాలు. ఉద్యోగులకు కొంత శ్రమ తప్పదు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఒత్తిడులు తప్పకపోవచ్చు.

వక్కంతం చంద్రమౌళి
జ్యోతిష్య పండితులు
ఫోన్​: 98852 99400