విమానం హైజాక్ ఘటన : బంగ్లాదేశ్ లో కలకలం

విమానం హైజాక్ ఘటన : బంగ్లాదేశ్ లో కలకలం

బంగ్లాదేశ్ లో  విమానం  హైజాక్ వ్యవహారం  కలకలం సృష్టించింది.  ఢాకా నుంచి  దుబాయ్ వెళ్తున్న  బిమన్ బీజీ  147 విమానాన్ని  దుండగుడు  హైజాక్ చేసే  ప్ర యత్నం చేశాడు. దీంతో విమానాన్ని చిట్టగాంగ్ లోని … షా అమానత్  ఇంటర్నేషనల్  ఎయిర్ పోర్ట్ లో  అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఫ్లైట్ ల్యాండ్ అవగానే  పోలీసులు విమానాన్ని చుట్టు ముట్టారు. ప్రయాణికులు భయంతో  వణికిపోయారు. దీంతో  కాసేపు ఏం జరుగుతుందో అన్న టెన్షన్ వాతావరణం నెలకొంది.  చివరకు  హైజాకర్ పోలీసుల కాల్పుల్లో చనిపోయాడు. ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు.