ఆగస్టు 12 సంపూర్ణ సూర్యగ్రహణం .. ఏఏ దేశాల్లో కనపడుతుంది.. భారతదేశంపై గ్రహణ ప్రభావం ఎలా ఉంటుంది..!

 ఆగస్టు 12 సంపూర్ణ సూర్యగ్రహణం .. ఏఏ దేశాల్లో కనపడుతుంది.. భారతదేశంపై గ్రహణ ప్రభావం ఎలా ఉంటుంది..!

ప్రపంచవ్యాప్తంగా చారిత్రకరోజు ఈ శతాబ్దంలో రానుంది.  వందేళ్లలో ఎప్పుడూ చూడని వింత ఖగోళంలో ఆవిష్కృతం కానుంది.  2026 ఆగస్టు 12 వ తేదీన పెద్ద సూర్యగ్రహణం సంభవిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.  ఎంతటైం ఉంటుంది.. ఏ సమయంలో కనపడుతుంది.. ఏఏ దేశాల్లో  కనపడుతుంది.. భారతదేశంపై గ్రహణ ప్రభావం ఎలా ఉంటుంది..మొదలగు విషయాలను ఈస్టోరీలో తెలుసుకుందాం.. !

భారత ప్రామాణిక సమయం ప్రకారంసూర్య గ్రహణం ఆగస్టు 12వ తేదీ రాత్రి సంభవిస్తుంది. గ్రహణం పాక్షిక దశ రాత్రి 9:04 గంటలకు ప్రారంభమై ఉదయం 4:25 గంటలకు ముగుస్తుంది. సూర్యగ్రహణం ప్రధాన దశ 6 నిమిషాల 23 సెకన్ల పాటు ఉంటుంది. అందువల్ల, ఈ గ్రహణాన్ని సుదీర్ఘకాల సూర్యగ్రహణంగా పరిగణిస్తారు.

భారతదేశంలో కనిపిస్తుందా

సూర్యగ్రహణం సంభవించే సమయంలో భారతదేశంలో రాత్రి సమయం కావడం వల్ల దానిని ఇక్కడ చూడటం అసాధ్యం, గ్రహణం  సూతకాలం ఇక్కడ వర్తించదు..ఆగస్టు 12న సంభవించే సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. అందువల్ల, భారతీయులు ఆకాశంలో అగ్నివలయం అనే అరుదైన దృశ్యాన్ని వీక్షించలేరు.  కాబట్టి భారతదేశంపై గ్రహణ ప్రభావం అంతగా ఉండదని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు

ఏఏ దేశాల్లో కనపడుతుంది..

2026 ఆగస్టు 12న జరిగే సంపూర్ణ సూర్యగ్రహణం కోసం ప్రపంచవ్యాప్తంగా ఖగోళ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ గ్రహణం గ్రీన్‌ల్యాండ్, ఐస్‌లాండ్, ఉత్తర రష్యా, అట్లాంటిక్ మహాసముద్రం, స్పెయిన్, పోర్చుగల్‌లోని కొన్ని ప్రాంతాల్లో కనిపించనుంది. అలాగే ఉత్తరార్ధగోళంలోని కొన్ని ప్రాంతాల్లో పాక్షిక సూర్యగ్రహణం కూడా కనిపిస్తుంది. ఉత్తర అమెరికాలోని కొన్ని ప్రాంతాలు, కెనడా, యూరప్‌లోని అనేక ప్రాంతాలు, వాయువ్య ఆఫ్రికాలో ఈ దృశ్యం కనిపించే అవకాశం ఉందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.