ఆగస్టు నెలలో సినిమాల జాతర.. మూవీ లవర్స్ కు పండగే!

ఆగస్టు నెలలో సినిమాల జాతర.. మూవీ లవర్స్ కు పండగే!

సినిమా ఇండస్ట్రీలో వారానికో కొత్త సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉంటుంది. తమ డైలీ రొటీన్ లైఫ్ లో బిజీగా ఉండే ఆడియన్స్ వీకెండ్స్ సినిమాలు చూసి రిలాక్స్ అవుతూ ఉంటారు. ఆ సెంటిమెంట్ ను కంటిన్యూ చేస్తూ.. ఆగస్టు నెలలో కూడా వరుస సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ లిస్టులో సూపర్ స్టార్, మెగాస్టార్ కూడా ఉన్నారు. మరి ఆగస్టు నెలలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఆ సినిమాల వివరాలు ఇప్పడు తెలుసుకుందాం. 

లిస్టులో ముందుగా వస్తున్న హీరో సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth). ఆయన హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ జైలర్(Jailer) మూవీ ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా లెవల్లో రానున్న ఈ సినిమా ఇండియా వైడ్ గా భారీ అంచనాలున్నాయి. ఇక రజిని కూడా గత కొంతకాలంగా సరైన హిట్ లేదు. అందుకే ఈ సినిమా కోసం సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi)  నటిస్తున్న భోళా శంకర్(Bhola Shankar) సినిమా ఆగస్టు 11న థియేటర్స్ లోకి రానుంది. మెహర్ రమేష్(Meher Shankar) దర్శకత్వం వహిస్తున్న ఆ మాస్ ఎంటర్టైనర్ పై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. సినిమా నుండి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. 

మళయాళ హీరో  దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) హీరోగా వస్తున్న కింగ్ ఆఫ్ కోటా(King of kota) సినిమా ఆగస్టు 18న రిలీజ్ కానుంది. సీత రామమ్(Sita ramam) హ్యుజ్ సక్సెస్ తరువాత దుల్కర్ క్రేజ్ నెక్స్ట్ లెవల్ కు చేరిన నేపధ్యంలో .. ఈ సినిమాపై కుల మంచి అంచనాలు ఏర్పడ్డాయి. 

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) హీరోగా వస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనెర్ గాండీవధారి అర్జున(Gaandeevadhari Arjuna). స్టైలీష్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు(Pravin sattaru) తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఆగస్టు 25న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. గని(Gani) వంటి డిజాస్టర్ తరువాత వరుణ్ నుండి వస్తున్న సినిమా కావడంతో గాండీవధారి అర్జున కోసం వరుణ్ తేజ్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 

యంగ్ హీరో కీర్తికేయ గుమ్మికొండ(Karthikeya Gumikonda) డీజే టిల్లు(DJ Tillu) భామ నేహా శెట్టి(Neha shetty) హీరోహీరోయిన్స్ చేస్తున్న మరో డిఫరెంట్ మూవీ బెదురులంక 2012. ఈ సినిమా కూడా ఆగస్టు 25న థియేటర్స్ లోకి వస్తోంది. చాలా గ్యాప్ తరువాత  కీర్తికేయ నుండి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. 

మరి ఈ సినిమాల్లో ఆడియన్స్ ఏ సినిమాకు ఏ రిజల్ట్ ఇవ్వనున్నారు అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.