నిప్పులు చెరిగిన హసన్‌‌‌‌ మహమూద్‌.. ఫస్ట్ ఇన్నింగ్స్‎లో ఆస్ట్రేలియా 198 ఆలౌట్‌‌‌‌‌‌‌‌‌‌

నిప్పులు చెరిగిన హసన్‌‌‌‌ మహమూద్‌.. ఫస్ట్ ఇన్నింగ్స్‎లో ఆస్ట్రేలియా 198 ఆలౌట్‌‌‌‌‌‌‌‌‌‌

డార్విన్: బంగ్లాదేశ్‌‌‌‌తో గురువారం మొదలైన తొలి టెస్ట్‌‌‌‌లో ఆస్ట్రేలియా బ్యాటింగ్‌‌‌‌లో తడబడింది. బంగ్లా పేసర్‌‌‌‌ హసన్‌‌‌‌  మహమూద్‌‌‌‌ (6/55) కెరీర్‌‌‌‌ బెస్ట్‌‌‌‌ గణాంకాలు నమోదు చేయడంతో.. టాస్‌‌‌‌ గెలిచి బ్యాటింగ్‌‌‌‌కు దిగిన ఆసీస్‌‌‌‌ తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో 53 ఓవర్లలో 198 రన్స్‌‌‌‌కే ఆలౌటైంది. స్టీవ్‌‌‌‌ స్మిత్‌‌‌‌ (71) ఒంటరి పోరాటం చేసినా రెండో ఎండ్‌‌‌‌లో సరైన సహకారం లభించలేదు. ట్రావిస్‌‌‌‌ హెడ్‌‌‌‌ (22), జాక్‌‌‌‌ వెదరాల్డ్‌‌‌‌ (23) తొలి వికెట్‌‌‌‌కు 45 రన్స్‌‌‌‌ జోడించారు.

అయితే హసన్‌‌‌‌ తన వరుస ఓవర్లలో ఈ ఇద్దర్ని ఔట్‌‌‌‌ చేశాడు. మార్నస్‌‌‌‌ లబుషేన్‌‌‌‌ (1), కామెరూన్‌‌‌‌ గ్రీన్‌‌‌‌ (13), అలెక్స్‌‌‌‌ కెరీ (19), బ్యూ వెబ్‌‌‌‌స్టర్‌‌‌‌ (12), కమిన్స్‌‌‌‌ (9), మిచెల్‌‌‌‌ స్టార్క్‌‌‌‌ (1), నేథన్‌‌‌‌ లైయన్‌‌‌‌ (7) విఫలమయ్యారు. టస్కిన్‌‌‌‌ అహ్మద్‌‌‌‌, ఎబాదత్‌‌‌‌ హుస్సేన్‌‌‌‌ చెరో రెండు వికెట్లు తీశాడు. 

తర్వాత బ్యాటింగ్‌‌‌‌కు దిగిన బంగ్లాదేశ్‌‌‌‌ ఆట ముగిసే టైమ్‌‌‌‌ 24 ఓవర్లలో 96/1 స్కోరు చేసింది. షాద్మాన్‌‌‌‌ ఇస్లామ్‌‌‌‌ (20) తొందరగా ఔటైనా.. తన్జిద్‌‌‌‌ హసన్‌‌‌‌ (32 బ్యాటింగ్‌‌‌‌), మోమినల్‌‌‌‌ హక్‌‌‌‌ (35 బ్యాటింగ్‌‌‌‌) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం బంగ్లా ఇంకా 102 రన్స్‌‌‌‌ వెనకబడి ఉంది. 2003 తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ ఆడుతున్న తొలి టెస్టు మ్యాచ్ ఇది.