ఆస్ట్రేలియా vs సౌతాఫ్రికా ... ఇండియాతో ఫైనల్‌లో ఎవరు?     

ఆస్ట్రేలియా vs  సౌతాఫ్రికా ... ఇండియాతో ఫైనల్‌లో ఎవరు?     
  • ఇండియాతో ఎవరు?     
  • మ. 2 నుంచి స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లైవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కతా: ఓవైపు ఐదుసార్లు చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. మరోవైపు నాలుగుసార్లు సెమీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఓడిన జట్టు.. ఒకరిదేమో తిరుగులేని ఆధిపత్యం... మరికొరిదేమో నాకౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒత్తిడిని జయించలేని పరిస్థితి.. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా కీలక పోరుకు రెడీ అయ్యాయి. ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెర్తే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న ఈ రెండు జట్ల మధ్య గురువారం సెమీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జరగనుంది. లీగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దశలో సౌతాఫ్రికా చేతిలో ఓడిన కంగారూలు ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రతీకారం కోసం ఎదురుచూస్తున్నారు. దాంతో పాటు 8వసారి ఫైనల్లోకి అడుగుపెట్టాలని టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పెట్టుకున్నారు. పాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నెదర్లాండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై వరుసగా సెంచరీలు కొట్టిన ఓపెనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వార్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉండటం అతిపెద్ద బలం. 

హెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు వెటరన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టీవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్మిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి రావాలి. మిడిలార్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లబుషేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జోష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంగ్లిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిలబడితే భారీ స్కోరును ఆశించొచ్చు. వీళ్లందర్ని పక్కనబెడితే ఆల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రౌండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒక్కడు ఆడినా ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విజయాన్ని ఈజీగా ఊహించొచ్చు. అఫ్గానిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై డబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంచరీ ఆటే ఇందుకు అతిపెద్ద నిదర్శనం. బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో స్టార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కమిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హేజిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కూడిన పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ త్రయం ఇచ్చే ఆరంభం అత్యంత కీలకం కానుంది. మరోవైపు చోకర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ముద్రపడ్డ సౌతాఫ్రికా దాని నుంచి బయటపడాలని యోచిస్తున్నది. 

ఇందుకోసం పక్కా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నది. ఓపెనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డికాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు మార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, క్లాసెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీ20 క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆడుతుండటం అతిపెద్ద బలంగా మారింది. కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బవూమ, మిల్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డసెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా మెరిస్తే గట్టిపోటీ ఇవ్వొచ్చు. బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జాన్సెన్, ఎంగిడి, రబాడపై భారీ ఆశలున్నాయి. స్పిన్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కేశవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు షంసి నుంచి సహకారం అందితే కంగారూలను ఇబ్బంది పెట్టొచ్చు.