111 రన్స్‌‌‌‌ తేడాతో సఫారీలను చిత్తు చేసిన ఆసీస్‌‌‌‌

111 రన్స్‌‌‌‌ తేడాతో సఫారీలను చిత్తు చేసిన ఆసీస్‌‌‌‌

డర్బన్‌‌‌‌: సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో ఆస్ట్రేలియా అదరగొట్టింది. బ్యాటింగ్‌‌‌‌లో మిచెల్‌‌‌‌ మార్ష్‌‌‌‌ (49 బాల్స్‌‌‌‌లో 13 ఫోర్లు, 2 సిక్స్‌‌‌‌లతో 92 నాటౌట్‌‌‌‌), టిమ్‌‌‌‌ డేవిడ్‌‌‌‌ (28 బాల్స్‌‌‌‌లో 7 ఫోర్లు, 4 సిక్స్‌‌‌‌లతో 64) దంచికొట్టడంతో బుధవారం అర్ధరాత్రి ముగిసిన ఈ మ్యాచ్‌‌‌‌లో ఆసీస్‌‌‌‌ 111 రన్స్‌‌‌‌ తేడాతో సఫారీలను చిత్తు చేసింది. 

దీంతో మూడు మ్యాచ్‌‌‌‌ల సిరీస్‌‌‌‌లో 1–0 లీడ్‌‌‌‌లో నిలిచింది. టాస్‌‌‌‌ ఓడిన ఆసీస్‌‌‌‌ 20 ఓవర్లలో 226/6 స్కోరు చేసింది. ఆరోన్‌‌‌‌ హార్డీ (23), మాథ్యూ షార్ట్‌‌‌‌ (20) ఫర్వాలేదనిపించారు. తర్వాత సౌతాఫ్రికా 15.3 ఓవర్లలో 115 రన్స్‌‌‌‌కే ఆలౌటైంది. రెజా హెండ్రిక్స్‌‌‌‌ (56) టాప్‌‌‌‌ స్కోరర్‌‌‌‌. ఆసీస్‌‌‌‌ బౌలర్లలో తన్వీర్‌‌‌‌ సంగా 4, స్టోయినిస్‌‌‌‌ 3 వికెట్లు తీశారు.