సిటీలో ఆసీస్ క్రికెటర్ల షాపింగ్

సిటీలో ఆసీస్ క్రికెటర్ల షాపింగ్

హైదరాబాద్ జీవీకే మాల్ లో నిన్న రాత్రి ఆస్ట్రేలియా ఆటగాళ్లు సందడి చేశారు.  ఆసీస్ విధ్వంసకర బ్యాటర్ గ్లేన్ మ్యాక్స్‌వెల్‌.. సహచర ఆటగాళ్లతో కలిసి సరదాగా కారులో షికారు చేశారు. స్టీవ్ స్మిత్‌తో కలిసి జీవీకే మాల్‌లో షాపింగ్ చేశాడు.  ఆసీస్ క్రికెటర్లకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేసి... మాల్ మొత్తం తిరుగుతూ ఎంజాయ్ చేశారు. ఒకవైపు లైటింగ్ ఫోకస్..భాగ్యనగరం అందాలు చూస్తూ తెగ సంబరపడ్డారు. ఆస్ట్రేలియా బ్యాటర్లకు పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఉప్పల్ స్టేడియం వేదికగా ఇవాళ రాత్రి 7.30 గంటలకు జరగనున్న సిరీస్ డిసైడర్ మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా, టీమిండియా జట్ల ఆటగాళ్లు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో క్రికెటర్లకు ఫ్యాన్స్ ఘన స్వాగతం పలికారు. ఆటగాళ్లను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.