ఆటో డ్రైవర్ క్రేజీ స్టంట్.. ట్రాఫిక్ ని తప్పించుకోవాలంటే ఇలాగే చేయాలేమో?

ఆటో డ్రైవర్ క్రేజీ స్టంట్.. ట్రాఫిక్ ని తప్పించుకోవాలంటే ఇలాగే చేయాలేమో?

ట్రాఫిక్ ని తప్పించుకోవడానికి కొందరు బైకర్స్ అప్పుడప్పుడు ఫుట్ పాత్ లపై ప్రమాదకరంగా ప్రయాణిస్తుంటారు. మరి పెద్ద వాహనాలకు ఆ ఛాన్స్ ఎందుకు ఉండదు అని అనుకున్నాడేమో ఆ ఆటో డ్రైవర్.. ఏకంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఎక్కి, మెట్లపై ఆటో నడిపాడు. 

ఢిల్లీలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హమ్ దర్ద్ నగర్లోని జంక్షన్ వద్ద ట్రాఫిక్ జామ్ అయింది. ఓ డ్రైవర్ ట్రాఫిక్ లో వేచి ఉండటానికి ఇష్టపడలేదు. 

ఇంకేముందీ మెయిన్ రోడ్డుపై ఉన్న ఆటోను ఫుట్ ఓవర్ బ్రిడ్జీ ఎక్కించి.. వంతెన మెట్లపైకి ఆటోను మళ్లించాడు. మెట్లపై సగం దూరం వెళ్లాక ఓ వ్యక్తి బయటకి దూకడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు.  
ఈ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయగా నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. 

కొందరు ఆటో డ్రైవర్ సాహసాన్ని మెచ్చుకోగా, మరి కొందరు పబ్లిక్ కి ఇబ్బంది కలిగించేలా డ్రైవర్ ప్రవర్తించాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.