IPL 2024 auction: తెలంగాణ యువకుడిని సొంతం చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్

IPL 2024 auction: తెలంగాణ యువకుడిని సొంతం చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్

అండర్ 19 ప్రపంచ కప్‌కు ఎంపికైన తెలంగాణ, సిరిసిల్లా జిల్లాకు చెందిన ఆరవెల్లి అవనీష్ రావు(వికెట్‌ కీపర్‌/ బ్యాటర్) చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. రూ.20 లక్షల బేస్ ప్రైస్‌కు అతన్ని కోలుగోలు చేసింది.

అండర్ 19 క్రికెట్ ప్రపంచకప్ టోర్నీ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో అరవెల్లి అవనీష్ రావు  చోటు దక్కించుకున్నాడు. ఈ యువ ఆటగాడి స్వస్థలం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ మండలంకి చెందిన పోత్గల్ గ్రామం. వికెట్ కీపర్ బ్యాటర్ గా సత్తా చాటిన ఈ తెలుగు కుర్రాడు.. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడనున్నాడు. తెలంగాణ ప్రాంతం నుంచి అదీ కూడా సిరిసిల్ల లాంటి ప్రాంతం నుంచి ఒక కుర్రాడు జాతీయ జట్టుకు ఎంపికవ్వడం చెప్పుకోదగిన విషయమే.