పెళ్లికి రెడీ అయిన టాలీవుడ్ హీరోయిన్.. వరుడు ఎవరంటే.?

పెళ్లికి రెడీ అయిన  టాలీవుడ్ హీరోయిన్.. వరుడు ఎవరంటే.?

చిన్నారి పెళ్లి కూతురితో తెలుగు వాళ్లకు సుపరిచితమైన నటి ఆవికా గోర్ పెళ్లిపీటలు ఎక్కబోతుంది. తన ప్రియుడితో ఏడడుగులు వేయడానికి సిద్ధమైంది. ఐదేళ్ల ప్రేమ పెళ్లిగా మారబోతుంది. తన ప్రియుడు మిలింద్ చంద్వానీతో ఉన్న  ఫోటోలను ఇన్ స్టాలో  పోస్ట్ చేసిన ఆవికాగోర్ తన ఎంగేజ్ మెంట్ జరిగినట్లు  చెప్పింది. మిలింద్ చంద్వానీతో ఆవికాగోర్ 2020 నుంచి ప్రేమలో ఉంది. పలు ఇంటర్వ్యూలల్లో ఓపెన్ గానే తన ప్రేమ గురించి మాట్లాడేది. 

 ప్రియుడు మిలింద్ చంద్వాని  పెళ్లి చేసుకుంటావా అని అడిగినప్పుడు తన ఆనందానికి అవధుల్లేవని సంతోషంతో  ఏడ్చేశానని చెప్పింది. ఈ క్షణం కోసమే ఎదురుచూస్తున్నట్లు గట్టిగా అరిచా.నిజమైన ప్రేమ అంటే ఇదే కావొచ్చు. జీవితంలో అన్నీ ఫర్ఫెక్ట్ గా ఉండకపోవచ్చు కానీ అందులో ఉన్న మ్యాజిక్కే వేరని చెప్పుకొచ్చింది అమ్మడు.

మిలింద్ చంద్ వానీ ఎవరు?

మిలింద్ చంద్వానీ  క్యాంప్ డైరీస్  అనే ఎన్జీవోను కూడా నడుపుతున్నాడు.  IIM అహ్మదాబాద్ నుంచి MBA పట్టభద్రుడైన మిలింద్  ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా  తన జీవితాన్ని మొదలు పెట్టాడు. 2019లో MTV రోడీస్ రియల్ హీరోస్‌ షో ద్వారా పాపులర్ అయ్యాడు. 

తెలుగులో చిన్నారి పెళ్లి కూతురితో ఫేమస్ అయిన ఆవికా గోర్ ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. సినిమా చూపిస్తా మావా..ఎక్కడికి పోతావు చిన్నవాడా,బ్రో,షణ్ముఖ, లక్ష్మీ రావే మా ఇంటికి వంటి సినిమాల్లో నటించింది ఆవికా గోర్.