Rajat Patidar: ధురంధర్ బాయ్.. ఆర్సీబీ కెప్టెన్ హెయిర్ స్టైల్‌పై అక్షర్ పటేల్ ఫన్నీ కామెంట్స్ వైరల్

Rajat Patidar: ధురంధర్ బాయ్.. ఆర్సీబీ కెప్టెన్ హెయిర్ స్టైల్‌పై అక్షర్ పటేల్ ఫన్నీ కామెంట్స్ వైరల్

Rajat Patidar: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ ప్రారంభానికి కేవలం రెండు రోజులు మాత్రమే ఉంది. కాగా ఈ ఐపీఎల్ ఆరంభానికి ముందే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కెప్టెన్ రజత్ పాటిదార్ తన సరికొత్త హెయిర్‌స్టైల్‌తో సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారారు. ముంబైలో జరిగిన కెప్టెన్ల ఫోటోషూట్ సందర్భంగా జరిగిన ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఈ వీడియోపై నెటిజన్స్ రియాక్షన్స్ అదిరిపోయాయి. 
 
ధురంధర్ బాయ్: 
ముంబైలో జరిగిన ఫోటోషూట్ సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ అక్షర్ పటేల్, రజిత్ పాటిదార్‌ను చూసి ఆటపట్టించారు. పాటిదార్ పెంచుకున్న పొడవైన జుట్టు, ఇటీవల విడుదలైన బ్లాక్ బస్టర్ సినిమా 'ధురంధర్: ది రివెంజ్'లో రణవీర్ సింగ్ లుక్‌ను తలపిస్తోంది. దీంతో అక్షర్ పటేల్ అతడ్ని "ధురంధర్ బాయ్" అని పిలవడంతో అక్కడ ఉన్నవారు అందరూ ఒక్కసారిగా నవ్వులు చిందించారు. దీనికి పాటిదార్ కూడా చిరునవ్వుతో స్పందించి తన స్పోర్టివ్‌నెస్‌ని చాటుకున్నారు.

ఈ హెయిర్‌స్టైల్‌తోనే ట్రోఫీ: 
ఆర్‌సీబీ 'బోల్డ్ డైరీస్' వీడియోలో రజత్ పాటిదార్ తన కొత్త లుక్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఈ హెయిర్‌స్టైల్‌తో ఐపీఎల్ ట్రోఫీని పట్టుకుని ఉన్న ఒక ఫోటో నా దగ్గర ఉండాలని కోరుకుంటున్నాను అని తన మనసులో మాటను బయటపెట్టారు. కాగా గత ఏడాది ఐపీఎల్ విజేతగా నిలిచిన ఆర్‌సీబీ, ఈసారి కూడా టైటిల్‌ను నిలబెట్టుకోవాలనే కసితో ఉంది. పాటిదార్‌ క్లాసీ బ్యాటింగ్‌తో పాటు ఇప్పుడు అతడి స్టైలిష్ లుక్ కూడా అభిమానులను అలరిస్తోంది. సోషల్ మీడియాలో రణవీర్ సింగ్‌తో పాటిదార్‌ను పోలుస్తూ మీమ్స్ హల్‌చల్ చేస్తున్నాయి.

మార్చి 28వ తేదీన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య పోరుతో ఐపీఎల్ 19వ సీజన్ ప్రారంభం కానుంది. ఈ మెగా క్యాష్ రిచ్ లీగ్ ఓపెనింగ్ సెర్మనీ లేకుండానే ఈసారి మొదలు కాబోతుందని సమాచారం. గత ఏడాది బెంగళూరులో జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన 11 మంది బాధితులకు నివాళిగా, ఈ ఏడాది ఐపీఎల్ గ్రాండ్ ఓపెనింగ్ సెర్మనీని రద్దు చేస్తున్నట్లు తెలుస్తుంది.