Ayush Sharma: నన్ను కుక్కతో పోల్చారు.. ఎమోషనల్ అయిన బాలీవుడ్ నటుడు ఆయుష్

Ayush Sharma: నన్ను కుక్కతో పోల్చారు.. ఎమోషనల్ అయిన బాలీవుడ్ నటుడు ఆయుష్

బాలీవుడ్ నటుడు ఆయుష్ శర్మ(Ayush Sharma) ఎమోషనల్ అయ్యారు. నటుడిగా కెరీర్ మొదలుపెట్టినరోజుల్లో తనపై వచ్చిన కామెంట్స్ ను గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. తనకు కుక్కతో పోల్చుతూ నీచంగా వార్తలు రాశారని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. ఆయుష్ శర్మ హీరోగా వచ్చిన మూవీ లవ్ యాత్రి. 2018లో వచ్చిన ఈ సినిమాను అభిరాజ్ మినావాలా తెరకెక్కించగా స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నిర్మించారు. తెలుగులో సూపర్ హిట్ గా నిలిచినా దేవదాసు సినిమాకు రీమేక్ గా వచ్చిన ఈ సినిమా ప్లాప్ గా నిలిచింది. దీంతో ఆయుష్ శర్మపై దారుణమైన ట్రోల్స్ వచ్చాయి. ఆయుష్‌కు బదులుగా ఓ కుక్కను పెట్టి సినిమా తీయాల్సిందని గోరమైన కామెంట్స్ వినిపించాయి. 

అయితే ఆ కామెంట్స్ పై తాజాగా ఎమోషనల్ గా స్పందించారు ఆయుష్ శర్మ. ఆయన హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ రుస్లాన్. ఈ సినిమా ఏప్రిల్ 26న థియేటర్స్ లోకి రానుంది. ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఓ ఈవెంట్ లో పాల్గొన్నారు ఆయుష్. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. నా పిల్లలు నన్ను చూసి గర్వపడాలని అనుకున్నాను. కానీ, ఆరోజు నా గురించి దారుణంగా మాట్లాడారు. నన్ను కుక్కతో పోల్చుతూ నీచమైన కామెంట్స్ చేశారు. రేపు నా పిల్లలు పెద్దయ్యాక ఈ వార్త చదివితే నా పరిస్థితి ఏంటి? పిల్లలు తమ తండ్రి గురించి మంచి విషయాలు తెలుసుకోవాలి. కానీ, నా గురించి తప్పుగా మాట్లాడిన వారికి ఇప్పుడు నేను థాంక్స్ చెప్పదలచుకున్నాను. వారి కామెంట్స్ వల్లనే నేను ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉన్నాను.. అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు.