సలార్ గురించి ముందే చెప్తే రిజల్ట్ వేరేగా ఉండేది.. బాహుబలి నిర్మాత ఇంట్రెస్టింగ్ కామెంట్స్

సలార్ గురించి ముందే చెప్తే రిజల్ట్ వేరేగా ఉండేది.. బాహుబలి నిర్మాత ఇంట్రెస్టింగ్ కామెంట్స్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth neel) కాంబోలో వచ్చిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ సలార్(Salaar). డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రభాస్ ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషీ చేసింది. దీంతో మొదటిరోజు రూ.178 కోట్ల రికార్డ్ కలెక్షన్స్ రాబట్టింది ఈ మూవీ. అయితే సలార్ సినిమాకు ప్రభాస్ ఫ్యాన్స్ నుండి అదిరిపోయే టాక్ వచ్చినా.. కామన్ ఆడియన్స్ నుండి మాత్రం మిక్సుడ్ టాక్ వచ్చింది. దీంతో మొదటి మూడు రోజులు అదరగొట్టేసిన సలార్ కలెక్షన్స్ ఆ తరువాత తగ్గుముఖం పట్టాయి.

అయితే సలార్ సినిమాపై, ఆ సినిమా సాధించిన కలెక్షన్స్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన సలార్ సినిమా గురించి మాట్లాడుతూ.. సలార్ మేకర్స్ ముందుగానే ఖాన్సార్ ప్రపంచాన్ని, అందులోని పాత్రలను ప్రేక్షకులకు పరిచయం చేసుంటే బాగుండేది. ఆ విషయంలో ఆడియన్స్ కాస్త కన్ఫ్యూజ్ అయ్యారు. ఇక హిందీలో సలార్ పెద్దగా ఎఫెక్ట్ చూపించకపోవడానికి కారణం డంకి అనుకున్నారు కానీ కాదు. సరైన ప్రమోషన్స్ లేకపోవడం. ప్రభాస్ మీడియా ముందుకు రాకపోవడం సలార్ సినిమాపై ఎఫెక్ట్ చూపించింది.

బాహుబలి సమయంలో మేము చేసిందే నేను చెప్తున్నాను. కథా, పాత్రలు అన్నింటినీ రాజమౌళి ముందే ఆడియన్స్ కు హింట్ ఇచ్చేశాడు. దాంతో ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవలేదు. సలార్ విషయంలో కూడా అదే జరిగి ఉంటే.. ఇప్పుడొస్తున్న రిజల్ట్ కు మించి ఎఫెక్ట్ ఉండేది.. అంటూ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు నిర్మాత శోభు యార్లగడ్డ. ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.