శిశువుకు పేగులు బయటికొచ్చాయి

శిశువుకు పేగులు బయటికొచ్చాయి

హైదరాబాద్ : కార్వాన్ ఏరియా హస్పిటల్ లో ఓ శిశువుకు పుట్టుకతోనే పేగులు బయటికొచ్చాయి. కడుపులో ఉండాల్సిన పేగులు బయట ఉన్నాయి. శిశువును చూసి షాక్ అయిన డాక్టర్లు..వెంటనే నిలోఫర్ హస్పిటల్ కి తరలించారు. శిశువు బొడ్డుపై పొడువుగా పేగులు ఉన్నాయని..ప్రస్తుతం బిడ్డ ఆరోగ్యంగానే ఉందని తెలిపారు. అయితే ఇలాంటి సంఘటన జరగడం అరుదు అని తెలిపారు డాక్టర్లు. చిన్నారిని తల్లిదండ్రులు 108లో నిలోఫర్ తీసుకువెళ్లారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.