అప్పుడే పుట్టిన పిల్లాడికి మీసాలా..? ఆశ్చర్యంగా ఉంది కదూ! భారీ కాయంతో.. పెద్దవాళ్లలా ముదిరిన మీసం కట్టుతో చిన్నపాటి బాల భీముడిలా ఉన్న ఈ శిశువు ఫోటో చూస్తే ఆశ్చర్యానికి గురవ్వాల్సిందే. సోషల్ మీడియాలో ఈ మీసాల శిశువు ఫోటో, వీడియోలు వైరల్ అవుతున్నాయి. కామెంట్స్, షేరింగ్స్ తో ట్రెండవుతోంది. ఈ మీసాల భీముడి స్టోరీ ఏంటో చూద్దాం.
ఎక్వడార్‌లో తీసినట్లు ప్రచారం అవుతున్న ఈ వీడియోలో బేబీ పై పెదవి, చెంపలపై నల్లని జుట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఇది చూసి నెటిజన్లు కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. జోకుల మీద జోకులు పేల్చుతున్నారు.
బ్రో కిండర్ గార్టెన్‌ను దాటేసి నేరుగా మిడ్‌లైఫ్ క్రైసిస్‌కు వచ్చేశాడు, ముగ్గురు పిల్లలు, రెండు మార్ట్‌గేజ్‌లతో రిటైర్ అయి పుట్టాడు, రెండు గంటల వయసులోనే 9 టు 5 జాబ్‌తో అలసిపోయినట్లు ఉన్నాడు.. లాంటి ఫన్నీ కామెంట్లతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. అంతేకాదు బేబీ ఫోటోలను ఎడిట్ చేసి ఆర్మీ యూనిఫాం, సిగర్‌తో బిజినెస్‌మెన్ లుక్, మారియో కాస్ట్యూమ్, హాన్ వారియర్ లాంటి ఫన్నీ చిత్రాలు తయారు చేస్తున్నారు.
శిశువుకు మీసం ఉండవచ్చా?
కొంత మంది నవజాత శిశువుల్లో గర్భంలో ఏర్పడే లానుగో అనే మెత్తని జుట్టు వెన్ను, భుజాలు, చెవులు, ముఖంపై కనిపిస్తుంది. ఇది సాధారణంగా పుట్టిన తర్వాత దానంతట అదే రాలిపోతుంది. కానీ లానుగో సన్నగా, రంగు లేకుండా ఉంటుంది. వైరల్ వీడియోలో కనిపించినట్లు అంత మందమైన, సరిగ్గా పెద్దవాళ్ల మీసంలా ఉండదని వైద్యులు చెబుతున్నారు. ఈ వీడియోకు సంబంధించి ఎలాంటి వైద్య ఆధారాలు లేకపోవడం గమనార్హం.
నిజమా? నకిలీనా?
వైద్య నిపుణులు ఈ వీడియోను డిజిటల్ మానిప్యులేషన్ అని చెబుతున్నారు. బేబీ తల, ముఖం కదిలినప్పుడు మీసం సహజంగా కదలడం లేదు. కొంచెం ఫ్లికర్, గ్లిచ్‌లు కనిపిస్తున్నాయి. లైటింగ్ కూడా ఆస్పత్రి గది కాంతికి సరిపోవడం లేదు. ఏ హాస్పిటల్, డాక్టర్, మెడికల్ రికార్డు లేదా కుటుంబం నుంచి కన్ఫమేషన్ రాలేదు. అసలు బేబీ వీడియో నిజమైనది కావచ్చు కానీ మీసం AI ఫిల్టర్ లేదా ఎడిటింగ్ టూల్‌తో జోడించి ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఈ వీడియో లక్షల మంది చూస్తూ హాస్యం చేస్తున్నప్పటికీ, ఇది ఫేక్ అని స్పష్టమవుతోంది.
🚨#VIRAL BABY BORN WITH MOUSTACHE 🇪🇨 A newborn in Ecuador has taken the internet by surprise with a striking dark patch of hair above the lip. https://t.co/G5ikJHkNC5
— Silent Observer (@YousufPash69914) October 24, 2026
