చెమట పట్టడం సహజమే.. కానీ ఆ చెమటతో వచ్చే దుర్వాసన మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది. ముఖ్యంగా అండర్ ఆర్మ్స్ నుంచి వచ్చే వాసనతో చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అయితే ఇంట్లోనే అందుబాటులో ఉండే కొన్ని సహజ చిట్కాలతో ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు. అవేంటో చూద్దాం.
చెమట వల్ల శరీరంలో ఉన్న మురికి అంతా బయటికి వస్తుంది. అది శరీరంపైన పేరుకుపోయి బ్యాక్టీరియా తయారవుతుంది. దాని వల్లే కొందరికి కాస్త చెమట పట్టినా అండర్ ఆర్మ్స్ నుంచి చెడు వాసన వస్తుంటుంది. ఈ సమస్యనుంచి బయటపడాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.
- నిమ్మరసాన్ని అండర్ ఆర్మ్స్ లో (చంకల్లో) రాయాలి. ఆరాక గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. నిమ్మరసంలో ఉన్న యాంటీబ్యాక్టీరియల్ లక్షణం చెడు వాసన పోగొడుతుంది. అంతేకాకుండా బేకింగ్ సోడాలో నీళ్లు కలిపి పేస్ట్ చేసి అండర్ ఆర్మ్స్ రాసినా చెడు వాసన రాదు.
- టేబుల్ స్పూన్ యాపిల్ సిడార్ వెనిగర్ను అరకపం నీళ్లలో కలిపి దూదితో అందర్ ఆర్మ్స్ లో రాసిన రిజల్ట్ ఉంటుంది. గ్రీన్ టీ తాగినా లేదా గ్రీన్ టీ నీళ్లను చెమట పట్టే చోట రాసినా యాంటీ ఆక్సిడెంట్గా పని చేసి చెడు వాసన పోగొడుతుంది.
- మూడు టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్లో ఒక కప్పు వెనిగర్ కలిపి అందర్ ఆర్మ్స్ లో స్ప్రే చేసినా మంచి రిజల్ట్ ఉంటుంది.
- వేడి నీళ్లలో ఎప్సమ్ సాల్ట్ కలిపి స్నానం చేస్తే చెడు వాసనతో పాటు, ఒత్తిడి కూడా తగ్గుతుంది.
- మెంతులను నీటిలో వేసి మరిగించి అ వీళ్లను రోజూ పరగడుపున తాగాలి. మెంతుల్లో ఉన్న యాంటీఆక్సిడెంట్ లక్ష ణాలు శరీరంలో ఉన్న వ్యర్థాలను పోగొడ తాయి. యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు చెడు వాసన రాకుండా చేస్తాయి.
చెమటను పూర్తిగా ఆపడం సాధ్యం కాదు.. కానీ దాని వల్ల వచ్చే చెడు వాసనను మాత్రం నియంత్రించవచ్చు. రోజువారీ పరిశుభ్రతతో పాటు ఈ సహజ చిట్కాలను పాటిస్తే అండర్ ఆర్మ్స్ వాసనకు చెక్ పెట్టొచ్చు. అయితే చర్మంపై ఎలాంటి ఇబ్బంది, అలర్జీ కనిపించినా వెంటనే వాడటం ఆపి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
