బ్యాడ్ బాయ్ కార్తీక్ వేసవిలో వస్తున్నాడు

బ్యాడ్ బాయ్ కార్తీక్ వేసవిలో వస్తున్నాడు

నాగ శౌర్య హీరోగా రూపొందుతున్న చిత్రం ‘బ్యాడ్ బాయ్ కార్తీక్‌‌‌‌‌‌‌‌’. రామ్ దేశినా (రమేష్‌‌‌‌‌‌‌‌) దర్శకుడు. శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై శ్రీనివాస రావు చింతలపూడి నిర్మిస్తున్నారు.  ఇప్పటికే విడుదలైన టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పాటలు ఆకట్టుకోగా, శుక్రవారం శ్రీరామ నవమి సందర్భంగా రిలీజ్ డేట్‌‌‌‌‌‌‌‌ అప్‌‌‌‌‌‌‌‌డేట్ ఇచ్చారు మేకర్స్. 

ఈ మూవీ   థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్‌‌‌‌‌‌‌‌ను దక్కించుకున్న  జీ స్టూడియోస్  ఏప్రిల్ 17న వరల్డ్‌‌‌‌‌‌‌‌వైడ్‌‌‌‌‌‌‌‌గా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. వేసవి సెలవులు కలిసొచ్చేలా ఈ డేట్‌‌‌‌‌‌‌‌ను అనౌన్స్ చేశామని మేకర్స్ తెలియజేశారు.   శ్రీదేవి విజయ్ కుమార్ హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నటిస్తుండగా,  విధి, సముద్రఖని, వీకే నరేష్, సాయికుమార్, మైమ్ గోపి, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, అజయ్ ఇతర ముఖ్య  పాత్రలు పోషిస్తున్నారు. హారిస్ జయరాజ్ సంగీతం అందిస్తున్నాడు.