సన్‌‌రైజర్స్‌‌ హైదరాబాద్‌‌కు బ్యాడ్‌‌ న్యూస్‌‌

సన్‌‌రైజర్స్‌‌ హైదరాబాద్‌‌కు బ్యాడ్‌‌ న్యూస్‌‌
  • ఐపీఎల్‌‌–14కు నటరాజన్‌‌ దూరం !

చెన్నై: హ్యాట్రిక్‌‌ ఓటముల తర్వాత ఓ విజయం సాధించి జోష్‌‌లోకి వచ్చిన సన్‌‌రైజర్స్‌‌ హైదరాబాద్‌‌కు బ్యాడ్‌‌ న్యూస్‌‌. సన్‌‌రైజర్స్‌‌ లెఫ్టార్మ్‌‌ పేసర్‌‌  టి. నటరాజన్‌‌ 2021 సీజన్‌‌ మొత్తానికి దూరమయ్యాడు. ఆస్ట్రేలియా టూర్‌‌లో అయిన మోకాలి గాయం తిరగబెట్టడంతో నట్టూ ఈ  సీజన్‌‌ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని సన్‌‌రైజర్స్‌‌ వర్గాలు వెల్లడించాయి.  ఐపీఎల్‌‌ –14లో రెండు మ్యాచ్‌‌లు ఆడిన నట్టూ కేవలం రెండు వికెట్లు తీశాడు. అయితే నట్టూ అంశంపై సన్‌‌రైజర్స్‌‌ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మోకాలి గాయానికి రీహాబిలేటేషన్‌‌ కోసం ఎన్‌‌సీఏలో ఉండటంతో నటరాజన్‌‌.. ఇంగ్లండ్‌‌తో జరిగిన ఐదు టీ20 సిరీస్‌‌లో తొలి నాలుగు మ్యాచ్‌‌లకు అందుబాటులో లేని విషయం తెలిసిందే.