రంజాన్‌‌ కానుకగా బడే మియా, చోటే మియా

రంజాన్‌‌ కానుకగా బడే మియా, చోటే మియా

అక్షయ్‌‌కుమార్‌‌(Akshay kumar), టైగర్‌‌ ష్రాఫ్‌‌(Tiger Shraf), పృథ్వీరాజ్ సుకుమారన్‌‌(Prithviraj Sukumaran) హీరోలుగా తెరకెక్కుతున్న హిందీ చిత్రం బడే మియా చోటే మియా(Bade Miya, Chote Miya).  అలీ అబ్బాస్‌‌ జాఫర్‌‌ దర్శకత్వం వ‌‌హిస్తున్నాడు. మానుషి చిల్లర్, సోనాక్షి సిన్హా హీరోయిన్స్. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌‌ గ్లింప్స్ ఆకట్టుకుంది. తాజాగా ఫస్ట్‌‌ లుక్ పోస్టర్‌‌‌‌ విడుదల చేయడంతో పాటు, సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఈ పోస్టర్‌‌‌‌లో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాప్‌‌ మెషిన్ గన్స్‌‌ పట్టుకుని యాక్షన్‌‌ లుక్‌‌లో కనిపిస్తున్నారు.

చుట్టూ యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 24న టీజర్‌‌‌‌ను విడుదల చేయబోతున్నట్టు చెప్పారు. అలాగే ఈద్ సందర్భంగా ఏప్రిల్‌‌ 10న సినిమాను రిలీజ్‌‌ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయబోతున్నారు.  అదే డేట్‌‌కి ఎన్టీఆర్‌‌‌‌ హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న ‘దేవర’ చిత్రం పాన్‌‌ ఇండియా వైడ్‌‌గా విడుదల కానుంది. దీంతో ఈ రెండు చిత్రాల మధ్య బాక్సాఫీస్‌‌ పోటీ ఉండబోతోంది.