ఆసక్తికరంగా బహుముఖం మూవీ టీజర్

ఆసక్తికరంగా బహుముఖం మూవీ టీజర్

హర్షివ్ కార్తీక్ ప్రధాన పాత్రలో నటిస్తూ, దర్శకనిర్మాతగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘బహుముఖం’. గుడ్, బ్యాడ్  అండ్ ది యాక్టర్ అనేది ట్యాగ్‌‌లైన్‌‌. అరవింద్ రెడ్డి కో ప్రొడ్యూసర్. శనివారం టీజర్‌‌‌‌ లాంచ్‌‌ ఈవెంట్ జరిగింది. ముఖ్య​ అతిథిగా హాజరైన డైరెక్టర్ శశికిరణ్ తిక్క మాట్లాడుతూ ‘టీజర్ ప్రామెసింగ్‌‌గా ఉంది. విజువల్‌‌తో పాటు సౌండ్‌‌కు ఇంపార్టెన్స్ ఇచ్చారు. టీజర్‌‌‌‌లో కార్తిక్ హార్డ్ వర్క్ కనిపిస్తోంది. ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అన్నాడు.

ఇదొక సస్పెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్ అని బీజీఎం ఇచ్చిన శ్రీచరణ్ పాకాల  చెప్పాడు. ‘ఇందులో మూడు పాటలు కంపోజ్ చేశాను. హర్షివ్ కార్తీక్ తొలి సినిమానే చాలా గ్రిప్పింగ్‌‌గా తీశాడు’ అని ఫణి కళ్యాణ్‌‌ చెప్పాడు. హర్షివ్ కార్తీక్ మాట్లాడుతూ ‘యూఎస్‌‌లో తీసిన తెలుగు సినిమా. ప్రేక్షకులకు గుర్తుండిపోవాలనే ఉద్దేశంతో చేశాం. తప్పకుండా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది’ అని చెప్పాడు. త్వరలో సినిమా విడుదల కానుంది.