హీరోగా ఎంట్రీ ఇస్తోన్న RRR ఫైట్ మాస్టర్..

హీరోగా ఎంట్రీ ఇస్తోన్న RRR ఫైట్ మాస్టర్..

ప్రముఖ ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్ (Peter Hein)..బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాలకు కంపోజ్ చేసిన తమ ఫైట్స్తో..ఆడియాన్స్లో గూస్బంప్స్ తెప్పించేలా చేశారు. పాన్ ఇండియా సినిమాలకు తమ ఫైట్స్తో అలరించిన పీటర్ హెయిన్..ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా అవతారం ఎత్తబోతున్నాడు. డైరెక్టర్ ఎం. వెట్రి డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీని ట్రెండీ సినిమాస్ అధినేత జేఎం బషీర్‌, యంటీ సినిమాస్‌ అధినేత ఏఎం చౌదరి సంయుక్తంగా పాన్ ఇండియా వైడ్గా నిర్మిస్తున్నారు. 

లేటెస్ట్గా ఈ సినిమా పూజ కార్యక్రమం చెన్నైలో జరుపుకుంది. ఈ సినిమాలో పీటర్ హెయిన్ ఆటవివాసిగా కనిపించబోతున్నారు. భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం చాలా సంతోషమని..బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాలకు ఫైట్ మాస్టర్గా చేసిన పీటర్ హెయిన్తో సినిమా చేయడం మా అదృష్టమని తెలిపారు ప్రొడ్యూసర్స్. 

ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్ మాట్లాడుతూ..ఇంతటి భారీ చిత్రంలో హీరోగా నటిస్తున్నందుకు చాలా హ్యాపీ. ఈ సినిమా కోసం తాను ఏమేం చేయగలనో అది చేస్తానని, ఇందులో అటవీ వాసీగా యాక్ట్ చేస్తున్నట్లు తెలిపాడు. ఇందులో నటించడానికి తాను స్పెషల్ గా ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు..త్వరలో రెగ్యులర్ షూటింగ్ షురూ కానున్నట్లు పీటర్ వెల్లడించాడు.